close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (జనవరి 24 - 30)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


ఉద్యోగపరంగా శుభ ఫలితం ఉంటుంది. ఆశలు చిగురిస్తాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. భవిష్యత్తు అనుకూలిస్తుంది. ధనలాభం ఉన్నా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వారినుంచి సలహాలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారంలో కొంత శ్రమ ఉంటుంది. అభీష్టసిద్ధి ఉంది. సూర్యస్తుతి ఉత్తమం.


విశేష శుభాలున్నాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. సొంత నిర్ణయం ధర్మమార్గంలో నడిపిస్తుంది. ఒత్తిళ్లున్నాయి. తెలివిగా సంభాషించాలి. వారం మధ్యలో ఒక పనిలో పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కలసివస్తుంది. కాదు అనుకున్న పని ఒకటి దిగ్విజయంగా పూర్తవుతుంది. విష్ణుస్మరణ మంచి చేస్తుంది.


ఉద్యోగపరంగా అనుకూల కాలం నడుస్తోంది. మిగిలిన విషయాల్లో సందర్భాన్నిబట్టి వ్యూహాలు మార్చుకుంటూ పనులు పూర్తి చేసుకోవాలి. వాదాలకు దూరంగా ఉండాలి. ఆపదలు తొలగుతాయి. కొన్ని సమస్యలనుండి బయటపడతారు. తగినంత విశ్రాంతి అవసరం. కృషికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆంజనేయస్వామి స్మరణతో కార్యసిద్ధి ఉంటుంది.


సరైన ప్రణాళికలతో విజయం సాధిస్తారు. దైవానుగ్రహం విశేషంగా ఉంది. ప్రయత్నబలం అవసరం. ధనలాభం, అధికారలాభం ఉన్నాయి. తగినంత గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించాలి. సంకల్పసిద్ధి ఉంటుంది. నిర్మలమైన మనసుతో తీసుకునే నిర్ణయం కలిసొస్తుంది. శుభవార్త వింటారు. లక్ష్మీస్తుతి శక్తినిస్తుంది.


అదృష్టయోగం ఉంది. దేనికీ వెనుకాడవద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. ఎటుచూసినా ఉత్తమ ఫలితం గోచరిస్తోంది. ఇప్పుడు చేసే పనులు శీఘ్ర విజయాన్నిఇస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తు లాభం ఉంటుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. కొందరికి మీవల్ల సహాయం అందుతుంది. ఇష్టదేవతాస్మరణ మేలుచేస్తుంది.


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలసివచ్చే సమయం. ధర్మబద్ధంగా పైకి వస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. తగినంత ప్రయత్నం ఉంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. సమాజంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. ఆవేశానికి దూరంగా ఉండాలి. ధనధాన్యలాభం ఉంది. ఆపదలు తొలగుతాయి. శ్రమ ఫలిస్తుంది. శివారాధన ఉత్తమం.


బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురవుతాయి. గతానుభవంతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కలసివస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఉద్యోగంలో జాగ్రత్త. కొందరివల్ల అశాంతి నెలకొంటుంది. కుటుంబసభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఖర్చు తగ్గించాలి. నవగ్రహశ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది.


మంచి కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన విజయం సాధిస్తారు. దగ్గరివారితో కలుపుగోలుగా వ్యవహరించండి. అభిమానించేవారు పెరుగుతారు. సంతృప్తినిచ్చే ఫలితం ఒకటి ఉంటుంది. గురుశ్లోకం చదవడం మంచిది.


కాలం సహకరిస్తోంది. అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అర్హతను పెంచుకుంటూ లక్ష్యాన్ని సాధించండి. అవరోధాలు తొలగుతాయి. ఆర్ధికాంశాలు బాగున్నాయి. అయినా ఖర్చు విషయంలో తగు శ్రద్ధ అవసరం. ప్రతి పనీ ఇంట్లోవారితో చెప్పి చేయండి. నలుగురినీ కలపుకుపోవాలి. గృహ, వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది.


కాలం సహకరించడం లేదు. గతానుభవాలను గుర్తుపెట్టుకుని పనిచేస్తే ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించిన తర్వాతే పని ప్రారంభించాలి. స్వవిషయాలను ఇతరులతో చర్చించవద్దు. అపార్థాలకు అవకాశముంది. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మనశ్శాంతి లభిస్తుంది.


శాంత చిత్తంతో పనిచేసి లక్ష్యాన్ని చేరతారు. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. ధనలాభం సూచితం. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించండి. ఎవరినీ అతిగా నమ్మకూడదు. చేతిదాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి. వివాదాలకు అవకాశమివ్వవద్దు.  సూర్యనారాయణ మూర్తిని స్మరించండి. మంచి జీవితం లభిస్తుంది.


ఉత్తమకాలం నడుస్తోంది. అదృష్టయోగముంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తిలో పైకి వస్తారు. మంచి భావనతో తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి.  ఇంట్లో శుభం జరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అద్భుతమైన ఫలితం ఒకటి వారాంతంలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్మరణ శుభప్రదం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు