
వర్ణరంజితమైన ఈ దృశ్యాలను చూశాక... ‘లేలేత రంగులను అందంగా కలబోసి, అరుదైన పరిమళాలను మనోహరంగా అద్ది, సృష్టికర్త సుకుమారంగా చేసిన ఈ కుసుమాలను... దివి నుంచి భువికి ఏ దేవకాంతలు జారవిడిచారో!’ అని మీకనిపిస్తే తప్పేమీలేదు. నెదర్లాండ్స్‌లోని ఈ ‘క్యూకెనాఫ్’ గార్డెన్ ప్రపంచం మెచ్చిన అద్భుతం. ఇక్కడ వసంతం కళ్లుచెదిరే సౌందర్యంతో కనువిందు చేస్తుంది. ఎందుకంటే దారుల నిండా తులిప్, ఆర్కిడ్, లిల్లీ, దాలియా, రోజ్, కార్నేషన్ వంటి ఎన్నో రకాల పుష్పాలు ముగ్ధంగా విరబూసి మనల్ని మైమరపిస్తాయి. ఇక్కడ ఏటా స్ప్రింగ్ సీజన్లో దాదాపు 70 లక్షలకుపైగా పూలు ఒకేసారి వికసిస్తాయి! అంతేకాదు... ప్రతిసారీ విభిన్నమైన రీతుల్లో పూలను పెంచడం ఈ గార్డెన్ ప్రత్యేకత. అంటే మనం ఒక సీజన్లో చూసినప్పుడున్న పూల అమరిక మరోసారి ఉండదన్నమాట. అందుకే ఈ గార్డెన్‌ను సందర్శించేందుకు ఏడాదికి పది లక్షల మందికిపైగా పర్యటకులు వస్తారంటే ఆశ్చర్యమేముంది..!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్