close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (ఫిబ్రవరి 21-27)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

ముఖ్యకార్యాల్లో విజయం సాధిస్తారు. సమష్టి నిర్ణయం మేలుచేస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబపరంగా మంచి జరుగుతుంది. వారాంతంలో ఒకవార్త శక్తినిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఈశ్వరారాధన శ్రేయస్సునిస్తుంది.


మంచి మార్గంలో చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్నిస్తాయి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. అభీష్టసిద్ధికై విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది. మనోబలం లక్ష్యాన్ని చేరుస్తుంది. వారం మధ్యలో ఒక పని వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతను స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది.


కాలం సహకరిస్తోంది. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో ఇబ్బందుల నుండి బయటపడతారు. విఘ్నాలున్నా పనులు పూర్తిచేసి కోరుకున్న ఫలితం పొందుతారు. సాహస కార్యాలు అనుకూలంగా ఉంటాయి. ధనలాభం ఉంది. కష్టపడి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. శివారాధన సాంత్వననిస్తుంది.


అభీష్టసిద్ధి ఉంటుంది. చక్కని విజయం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. పదోన్నతులకు అవకాశముంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. సమస్యలు తొలగుతాయి. ఇష్టదైవారాధన శ్రేష్ఠం.


ఇష్ట కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు అనుకున్నట్లే జరుగుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. స్థిరత్వం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. అవరోధాలు తొలగుతాయి. వివాదాలకు తావివ్వకూడదు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. ఇష్టదేవతను స్మరించాలి.


అభీష్టసిద్ధి ఉంది. ఇబ్బందులు తొలగుతాయి. ధర్మం గెలిపిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఒక పనిలో పురోగతి ఉంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది.


వ్యాపారంలో కలిసివస్తుంది. విశేష లాభాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆవేశపడితే సమస్య ఎదురవుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. తల్లి తరఫు వారినుండి లాభపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. బాంధవ్యాలు బలపడతాయి. విష్ణుసహస్రనామం చదివితే మంచిది.


మనోబలంతో విజయం సాధిస్తారు. అభీష్టసిద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. భూ లాభం సూచితం. వారం మధ్యలో ఒక సమస్య నుంచి బయటపడతారు. అనేక మార్గాల్లో విజయాలు సాధించే అనుకూల కాలమిది. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.


అత్యంత శ్రేష్ఠమైన సమయం. సంకల్పం సిద్ధిస్తుంది. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. ఆర్థికంగా ఉత్తమకాలం నడుస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. ఉజ్జ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. సంఘంలో కీర్తి పొందుతారు. ప్రతిభతో ఆకర్షిస్తారు. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇష్టదైవ ప్రార్థన శక్తినిస్తుంది.


ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఆటంకాలున్నాయి. తెలివిగా ఎదుర్కోవాలి. ఒక ఆపద నుండి బయట పడతారు. ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇబ్బంది పెట్టే వారున్నారు. సొంత నిర్ణయాలు లాభాన్నిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.


శుభ యోగముంది. వ్యాపారంలో లాభముంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. ప్రతిభా పాటవాలతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. నృసింహ స్వామిని స్మరించండి. అంతా శుభమే జరుగుతుంది.


అదృష్టవంతులవుతారు. వ్యాపార లాభాలున్నాయి. అభీష్ట సిద్ధి పొందుతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఇంటా బయటా కలిసివస్తుంది. బుద్ధిబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ధనలాభం సూచితం. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలుంటాయి. ఎదురుచూస్తున్న ఫలితం సిద్ధిస్తుంది. మంచి జీవితం ఏర్పడుతుంది. లక్ష్మీదేవిని స్మరించడం ఉత్తమం.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు