
సాగిపోదాం... ఎడారిలో తుపానులా...
నారింజ వర్ణాన్ని ఆకాశంలోకి విరజిమ్ముతూ అస్తమించే సూర్యుడు... ఆ కాంతితో పోటీపడుతూ కనుచూపుమేరా ఎత్తుపల్లాలతో విశాలంగా పరచుకున్న ఇసుక తెన్నెలు... ఓ వైపు ఇసుకమీద ముగ్గులు వేస్తూ వీచే చల్లని గాలి... మరోవైపు మంద్రంగా వినిపించే సంగీత ఝరి... దుబాయ్ అరేబియా ఎడారిలో సాయంత్రాలు ఇలాగే అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో డెజర్ట్ సఫారీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు ఔత్సాహికులు. ఎత్తుగా ఉండే ఇసుక మేటల్ని ఢీకొంటూ, పక్కనే ఉండే లోతైన లోయల్లోకి జారిపోతూ సాగే ప్రయాణం జెయింట్ వీల్ ఎక్కినప్పటికన్నా పదిరెట్ల కిక్కిస్తుంది. అనుభవజ్ఞులైన డ్రైవర్లు పర్యటకుల్ని సఫారీకి తీసుకెళతారు. కావాలంటే సొంతంగా నడుపుకునేందుకు కార్లూ బైకులూ కూడా ఉంటాయి. ఇక సఫారీ తర్వాత పర్యటక సంస్థలు ఏర్పాటు చేసిన విడిది స్థలంలో అందాల భామల డాన్సుల్నీ, చక్కని సంగీతాన్నీ, అరేబియా రుచుల్నీ ఆస్వాదించవచ్చు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్