close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (ఫిబ్రవరి 28 - మార్చి 6)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


ఆర్థికంగా అనుకూల సమయం. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలుంటాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. మిత్రుల సలహాలు పాటించండి. స్పష్టమైన ఆలోచనలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. అనుకున్న పనులు నిదానంగా అవుతాయి. వారం మధ్యలో ఉత్సాహం వస్తుంది. చంద్ర శ్లోకం చదవండి, ప్రశాంతజీవనం లభిస్తుంది.


బుద్ధిబలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. అభీష్ట సిద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి సూచితం.ముఖ్య కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. విఘ్నాలను దాటుకుంటూ విజయం వైపు అడుగులు వేస్తారు. ఒక్కొక్కటిగా సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్వామిని స్మరిస్తే మంచిది.


విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. చాక చక్యంగా వ్యవహరించాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. దగ్గరివారి సలహాలు అవసరమవుతాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. సమష్టి నిర్ణయాలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఇష్టదేవతారాధన ఉత్తమం.


అదృష్టయోగముంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధికార యోగముంటుంది. ధర్మ సమ్మతమైన పనులు లాభాన్ని ఇస్తాయి. అయితే అవి మధ్యలో ఆగకుండాచూసుకోవాలి. భూ, గృహ యత్నాలు ఫలిస్తాయి. శ్రీరామస్మరణ శక్తినిస్తుంది.


ఉత్సాహంగా పనులను ప్రారంభించండి, శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. మిత్రుల మధ్య అపోహలు తొలగుతాయి. దైవానుగ్రహంతో మేలు చేకూరుతుంది. బంగారుమయ జీవితం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో ధార్మిక చింతన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. శివారాధన మంచిది.


కోరికలు నెరవేరతాయి. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. సత్సంకల్పంతో అంచెలంచెలుగా పైకి వస్తారు. సుసంపన్నమైన జీవితం లభించబోతోంది. తగినంత మానవ ప్రయత్నం అవసరం. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే శాంతి లభిస్తుంది. 


వ్యాపారంలో కలిసివస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పెద్దలతో సామరస్యంగా వ్యవహరించాలి. అనేక విఘ్నాలు ఎదురయ్యే అవకాశముంది. అపార్థాలకు తావివ్వవద్దు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబపరంగా కలిసివస్తుంది. పోయిన మనశ్శాంతి తిరిగి లభిస్తుంది. విష్ణుదర్శనం మేలు చేస్తుంది.


మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు చేస్తారు. అదృష్టయోగం పడుతుంది.  గొప్ప విజయాన్ని పొందుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారబలం పెరుగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యసిద్ధినిస్తాయి. వినోదాలతో కాలం గడుపుతారు. ఇష్టదేవతా దర్శనం మంచిది.


బ్రహ్మాండమైన జీవితాన్ని పొందుతారు. చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్నిచ్చే కాలమిది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఫలితం ఇప్పుడు కన్పిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రశంసించేవారు పెరుగుతారు. జీవితాశయం నెరవేరుతుంది. నచ్చిన దైవాన్ని స్మరిస్తే ప్రశాంతత చేకూరుతుంది.


ఆర్థికస్థితి బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరివల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్నిబట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. తోటివారి సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్యహృదయాన్ని పఠిస్తే మేలు.


సునాయాసంగా విఘ్నాలను అధిగమిస్తారు. శ్రేష్ఠమైన విజయం ఒకటుంది. ఉద్యోగవ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఇతరులపై ఆధారపడవద్దు. అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు చేస్తారు. శ్రమ అధికమైనా ఫలితం చాలా బాగుంటుంది. ధైర్యం కోల్పోకుండా కుటుంబసభ్యులతో కలిసి పనిచేస్తే తిరుగులేని విజయం ఉంటుంది. శివస్మరణ మంచిది.


ఉత్తమకాలం నడుస్తోంది. ఎటుచూసినా లాభమే గోచరిస్తోంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. వ్యాపారంలో పైకి వస్తారు. ధైర్యంగా బంగారు జీవితాన్ని నిర్మించుకోండి. సొంత నిర్ణయం కలిసివస్తుంది. సరైన మార్గంలో ప్రయత్నించి స్థిరమైన ఫలితాన్ని పొందుతారు. అవసరాలకు తగిన కార్యాచరణ ఉండాలి. ఇష్టదైవారాధన ఉత్తమం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు