close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తోటలో ఊరు!

దుల సంఖ్యలో బండి చక్రాల్లా పరుచుకున్న తోటలు... ఆ మధ్యలో ఎంతో తీరుగా అందంగా కట్టిన ఇళ్లూ... డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ దగ్గర్లో ఉన్న ‘బ్రాండ్‌బై గార్డెన్‌ సిటీ’ గ్రామాన్ని ఆకాశంలో నుంచి చూస్తే పచ్చటి చెట్లతో ముగ్గులు వేసినట్లూ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక, ఆ ఊరి మధ్యలోకి వెళ్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత చూడచక్కగా, అత్యాధునికంగా డిజైన్‌ చేశారంటే ఇదేదో నిన్న మొన్న ఏర్పాటైన ఊరు అనుకుంటే పొరబడినట్లే. నగర జీవనాన్ని వదిలి కొన్ని రోజులు ప్రకృతి ఒడిలో నివసించాలనుకునే వారికోసం స్థానిక ప్రభుత్వం 1964లో ఈ గార్డెన్‌ సిటీని నిర్మించిందట. హెన్రీ డూ అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటోలతో ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ గ్రామం కోసం ఆర్కిటెక్ట్‌ ఎరిక్‌ మైగిండ్‌ 24 గుండ్రటి తోటలను ఏర్పాటు చేశాడు. ఒక్కోతోటనీ 50చదరపు మీటర్ల విస్తీర్ణం ఉండే డజనుకు పైగా ప్లాట్‌లుగా విడగొట్టి అందులో ఇళ్లను నిర్మించాడు. అయితే, ఈ ఇళ్లను ఆ ఊరికి 20 కిలోమీటర్లలోపు నివసించే వారికి మాత్రమే అమ్ముతారు. అంతకన్నా దూరంలో ఉండేవారు అద్దెకు తీసుకోవచ్చు. గార్డెన్‌ సిటీలో ఉండేవారందరూ పరస్పరం కలిసి ఉండేలా ఇళ్ల మధ్యలో ఎక్కడా గోడలు పెట్టకుండా డిజైన్‌ చేశారట. ఎంత బాగుందో కదూ..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు