
‘నేలంతా నాకి మూలన కూర్చుంటుంది’, ‘వెయ్యి మందికి ఒకటే మొలతాడు’ ...ఇలా చీపురు గురించిన పొడుపుకథలు చాలా వినే ఉంటారు. అలాగే ఈతాకులు, కందికంపలు, కొబ్బరాకులు, పొరకగడ్డి... వంటి వాటితో పుల్లల చీపుర్లనీ, చీపురుగడ్డిగా పిలిచే టైగర్గ్రాస్తో మెత్తని కుంచె చీపుర్లనూ కడతారనేదీ తెలిసిందే. అయితే చీపుళ్లనీ ఎంతో కళాత్మకంగానూ రూపొందిస్తారనేది తెలుసుండకపోవచ్చు. ముఖ్యంగా వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, అమెరికా వంటి దేశాల్లో రంగులద్దుతూ వీటిని ఎంతో అందంగా కడుతుంటారు. ఆఫ్రికన్-అమెరికన్లయితే వధూవరులు చీపురుమీదుగా దూకే వేడుకలో భాగంగా దాన్ని రంగురాళ్లూ రిబ్బన్లూ పూసలతో అలంకరిస్తారు. అందుకే చీపుళ్లకీ చాలా సీనుంది అంటూ మనదేశంలోని జోధ్‌పూర్‌లో దానికో మ్యూజియాన్నీ ఏర్పాటుచేశారు. అంతేనా...కెంటకీలోని బెరియా ఆర్ట్స్ కాలేజీలో చీపురు కళకి సంబంధించిన కోర్సు కూడా ఉంది. ఏటా అక్కడ వర్కుషాపులూ నిర్వహిస్తుంటారట. గత వందేళ్ల నుంచీ అక్కడి విద్యార్థులు అందమైన చీపుళ్లను తయారుచేయడం ఒక విశేషమైతే, అమ్మకానికి పెట్టిన వెంటనే అవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం మరో విశేషం.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్