close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (ఏప్రిల్‌ 4 - 10)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

జాగ్రత్తగా ముందడుగు వేయండి. అధిక గ్రహదోషం సూచితం, ముఖ్యకార్యాలను కొద్దికాలం వాయిదా వేయాలి. ఉద్యోగంలో ప్రశాంతచిత్తంతో పనిచేయాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. కష్టాలను అధిగమిస్తారు. సొంత నిర్ణయం వద్దు. ఆత్మీయులతో చెప్పి చేసే పనులు లాభిస్తాయి. నవగ్రహ శ్లోక పారాయణం మంచిది.


ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. మంచి ప్రయత్నం చేసి స్థిరమైన జీవితాన్ని పొందుతారు. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. మోసపోకుండా జాగ్రత్తపడాలి. ఆవేశం మంచిదికాదు. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం వరిస్తుంది. వారం మధ్యలో ఒక పని లాభిస్తుంది. కొత్తగా ఆలోచించి అభివృద్ధిని సాధిస్తారు. దుర్గాదేవి స్మరణ శుభప్రదం.


ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. క్రమశిక్షణతో పనిచేసి గుర్తింపు సాధిస్తారు. రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. అపార్థాలకు అవకాశముంది. స్పష్టంగా సమాధానమివ్వాలి. మీవల్ల కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఈశ్వరారాధన మంచిది.


అదృష్టవంతులవుతారు. ఒక్కొక్కటిగా లక్ష్యాలు నెరవేరతాయి. భూ, గృహ లాభాలుంటాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గతంలో చేసిన మంచి పనులు అక్కరకొస్తాయి. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఒక ప్రమాదం నుండి బయటపడతారు. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. దగ్గరివారి వల్ల మేలు జరుగుతుంది. విష్ణుస్తుతి శ్రేయోదాయకం.


ధనలాభం ఉంది. అన్నివిధాలా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి. దగ్గరివారి నుండి ఇబ్బందులు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేయండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. చెడు ఊహలు రానీయవద్దు. వ్యాపారపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. ప్రయత్నపూర్వకంగా విజయం లభిస్తుంది. సూర్యధ్యానం శుభప్రదం.


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల అండ అవసరం. శాంతంగా సామరస్య ధోరణితో ముందుకుసాగండి. దృఢ సంకల్పంతో అద్భుతమైన ఫలితం వస్తుంది. మంచిని ఊహించండి. అభివృద్ధిని సాధిస్తారు. ఇష్టదేవతాస్మరణ మేలుచేస్తుంది.


ఆత్మస్థైర్యంతో విజయాన్ని అందుకుంటారు. మితభాషణం మంచిది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. గృహ- వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. వస్తు, వస్త్రప్రాప్తి ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. శుభం జరుగుతుంది.


అదృష్టయోగముంది. ధనలాభం సూచితం. పట్టుదలతో పనిచేస్తే ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. వ్యాపారయోగం మిశ్రమంగా ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయవద్దు. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. లక్ష్యం చేరేవరకూ శ్రమిస్తూనే ఉండండి. మంచి జీవితం లభిస్తుంది. సాహస కార్యాలు ఫలిస్తాయి. మిత్రుల అండ అవసరం. శివారాధన మంచిది.


ఉత్తమకాలం నడుస్తోంది. మంచి పనులు చేయటానికి సరైన సమయం. ధనలాభం ఉంది. వ్యాపారయోగం చాలా బాగుంది. ఉద్యోగంలో ఆటంకాలను అధిగమిస్తారు. గృహ నిర్మాణాది పనుల్లో పురోగతి ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.


త్వరగా లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో కలసి వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. ఒక ముఖ్య కార్యం మొదలవుతుంది. అయితే పని పూర్తయ్యేవరకూ గోప్యంగా ఉంచాలి. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి. బంధువులతో జాగ్రత్త. తగినంత విశ్రాంతి అవసరం. సమష్టి నిర్ణయాలు మంచిది. ఆంజనేయస్వామిని స్మరించండి. కార్యసిద్ధి ఉంటుంది.


మంచికాలం నడుస్తోంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. సుఖసంతోషాలు ఉంటాయి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శక్తులన్నీ కేంద్రీకరించి పనిచేయండి. ఆత్మీయుల సూచనలు ఉపయోగపడతాయి. ఆదిత్యహృదయం చదివితే మంచిది. 


బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరే సమయం కాబట్టి చక్కని కార్యాచరణ రూపొందించి అమలుచేయండి. పలువిధాలుగా పైకి వస్తారు. ధనధాన్యలాభాలు సూచితం. ఉద్యోగపరంగా శ్రద్ధను పెంచండి. వ్యాపారరీత్యా ఏకాగ్రత అవసరం. భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబపరంగా వృద్ధి ఉంటుంది. ఇష్టదైవస్మరణ శుభప్రదం.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు