close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంట్లోనే ఆఫీసు గది!

రోనా దెబ్బతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ తరగతులూ సాధారణం అయిపోయాయి. కానీ ఎంత కాదనుకున్నా ఇంట్లో ఆఫీసు వాతావరణం ఉండదు. పని చేసుకుంటున్న సమయంలో మన గదిలోకి ఎవరో ఒకరు రావడం, లేదంటే పిల్లలు ఆ టేబుల్‌ మీద ఉన్న ఆఫీసు ఫైళ్లూ ల్యాప్‌టాప్‌లు లాగడం, ఇంకేదో గందరగోళం అవుతూనే ఉంటుంది. పిల్లలకూ అంతే. వాళ్లు ఆన్‌లైన్‌ తరగతులు వింటున్న సమయంలో పక్కన వేరే శబ్దాలూ అవీ ఇవీ వినపడుతుంటే ఏకాగ్రత కుదరదు. వీటన్నిటికీ పరిష్కారమే ఈ ‘జిప్‌-పాడ్‌ హోమ్‌ ఆఫీస్‌ ఎన్‌క్లోజర్స్‌’. బెంగళూరుకి చెందిన జిప్‌-పాడ్‌ కంపెనీ రూపొందించిన ఇవి ఎక్స్‌పాండబుల్‌ గదులు. అంటే, దగ్గరగా నొక్కినపుడు అల్మరాలా చిన్నగా ఉండే వీటిని కావల్సినప్పుడు ఫొటోలో చూపినట్లు చిన్నసైజు గదిలానూ మార్చుకోవచ్చు. ఈ జిప్‌ పాడ్‌ల లోపల పవర్‌ పాయింట్లు, లైటు, ఫ్యాన్‌ కూడా ఉంటాయి. ఇక, తలుపులకు హ్యాండిల్‌ లాక్‌ కూడా ఉంటుంది కాబట్టి, పనైపోయాక డోర్‌ లాక్‌ చేస్తే పిల్లలు లోపలికెళ్లి పాడుచేసేస్తారన్న భయం కూడా ఉండదు. మీకూ కావాలంటే zip-pod.com లోకి వెళ్లి ఆర్డరివ్వొచ్చు.


రాత్రిపూట సూర్యకాంతి!

గలు వెన్నెల రాదు, రాత్రి సూర్యుడు రాడు... అయితే, ఈ ‘సన్నీ సోలార్‌ పవర్డ్‌ లైటు’ ఉంటే మాత్రం రాత్రిపూట సూర్యోదయం, సూర్యాస్తమయాలను తలపించే కాంతితో ఇంట్లో వెలుగుల్ని నింపొచ్చు. సౌరశక్తితో పనిచేసే ఈ లైటుని ఎండ తగిలే కిటికీ, బాల్కనీల్లో వేలాడదీస్తే పగలు ఆ సూర్యశక్తిని గ్రహించి రాత్రిపూట కరెంటుతో పనిలేకుండా వెలుగుతుంది. అంతేకాదు, ఈ లైటుని సూర్యోదయం, సూర్యాస్తమయం, పగటి వెలుగు... ఇలా మూడురకాల మోడ్‌లలో వెలిగించొచ్చు. పగలంతా ఆఫీసు పనులతో తీరికలేకుండా ఉండి, చీకటి పడ్డాక ఇల్లు చేరి, ఉదయం ఆలస్యంగా నిద్రలేచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడలేకపోతున్నాం అని బాధపడేవారూ ఈ లైటుతో ఆ లోటుని కాస్తైనా తీర్చుకోవచ్చన్నమాట.


పెన్నుతో క్యాండీ బొమ్మలు

మామూలుగా పెన్నులతో ఏం చేస్తాం... అంటే ‘రాసుకుంటాం’ అని ఎవరైనా టక్కున సమాధానం చెప్పేస్తారు. కానీ ఇక్కడ కనిపించే పెన్నులతో తియ తియ్యటి క్యాండీల బొమ్మల్ని తయారుచేయొచ్చు తెలుసా... ఈ ‘పోలరాయిడ్‌ క్యాండీ ప్లే త్రీడీ పెన్‌’లో క్యాండీ క్యాట్రిడ్జ్‌లను పెట్టి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు. పెన్ను లోపలిభాగం వేడెక్కి ఆ క్యాండీని కరిగిస్తుంది. తర్వాత మనం బటన్‌ని నొక్కిపెడితే అందులోంచి క్యాండీ జెల్‌ మెహందీ కోన్‌లో నుంచి గోరింటాకు వచ్చినట్లే వస్తుంది. దాంతో మనం పూరేకులూ ఆకుల్లాంటి నచ్చిన రూపాలను వేసుకోవచ్చు. పూర్తిగా ఆరకముందు వాటిని చేత్తో నచ్చినట్లు వంపులు తిప్పుకోవచ్చు కూడా. తర్వాత అలా ఆరనిస్తే అవి ఆయా రూపాల్లో గట్టిపడిపోతాయి. ఇంత అందమైన రూపాల్లో ఉన్నవాటిని పిల్లలకు తినడానికి ఇస్తే ఎంత సంతోషిస్తారో. కేకులూ డెజర్ట్‌లూ స్వీట్లమీద అలంకరించేందుకూ ఇవి బాగుంటాయి. ఇలాంటి క్యాండీ పెన్‌ ప్రపంచంలో ఇదే మొదటిదట. బాగుంది కదూ..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు