close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్ని దేశాలు ఇక్కడే!

ప్రపంచంలోని దేశాలన్నీ చూడాలనుకుంటున్నారా? గంటలో చూసి రావచ్చు. ‘అదేంటీ... విమానం కన్నా స్పీడుగా తీసుకెళ్లేదేమైనా ఉందా’ అనే అనుమానం వచ్చిందా..! అసలు విషయం ఏంటంటే... డెన్మార్క్‌లో వరల్డ్‌ మ్యాప్‌ ఒకటుంది. అందులో దేశాలూ, చుట్టూ నీళ్లూ ఉంటాయి. మహాసముద్రాల్లో దేశాలన్నీ ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉంటుంది. ఎకరం విస్తీర్ణంలో ఉండే ఈ ప్రపంచపటాన్ని సోరెన్‌ పోల్‌సెన్‌ రూపొందించాడు. ఇది పూర్తవ్వడానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టిందట. సరస్సు పక్కనే ఏర్పాటు చేసిన ఈ పటంలో పచ్చని గడ్డి, రాళ్లు పేర్చి ఉంటాయి. ప్రతీ దేశం దగ్గరా దానికి గుర్తుగా ఆ దేశ జెండా ఉంటుంది. దేశాల ఆకారాలూ, జెండాలతో పైనుంచి చూస్తే అచ్చం ప్రపంచపటాన్ని నేరుగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఆ సరదా తీర్చుకోవడానికి పిల్లలూ, పెద్దలూ ఇక్కడికి వచ్చేసి దేశాలన్నీ తిరిగేస్తూ, ఫొటోలు దిగేస్తుంటారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు