close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (ఏప్రిల్‌ 18 - 24)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

విశేషమైన ఫలితాలున్నాయి. అభీష్టసిద్ధి  ఉంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధనధాన్య యోగాలుంటాయి. కష్టాల నుంచి బయటపడతారు. సాహసకార్యాలు ఫలిస్తాయి. మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. సుఖ సంతోషాలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. శాంతి చేకూరుతుంది. 


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. కాలం సహకరించడం లేదు. ఉద్యోగంలో ఇబ్బందులుంటాయి. చెడు తలపులు రానీయవద్దు. శ్రేయోభిలాషుల సలహా మేలుచేస్తుంది. మొహమాటం వల్ల నష్టం వస్తుంది. బంధువుల ద్వారా పనులు పూర్తవుతాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.


అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. గత వైభవం లభిస్తుంది. తలచిన కార్యాలు పూర్తి అవుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఇంటాబయటా శుభమే జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభీష్టసిద్ధి ఉంటుంది. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేసే సమయమిది. ఇష్టదేవతాస్మరణ మంచిది.


చేపట్టే పనుల్లో విజయముంటుంది. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో పెద్దలు ప్రసన్నులవుతారు. ప్రశంసలందుతాయి. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించే వ్యక్తులున్నారు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. దేనికీ తొందరవద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దుర్గాదేవిని స్మరిస్తే మేలు జరుగుతుంది.


సర్వోత్తమ కాలం నడుస్తోంది. కోరుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. పోయినవి తిరిగి వస్తాయి. బంధుత్వాలు బలపడతాయి. సంపద లభిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధిస్తారు.సూర్యస్తుతి మీకు రక్షణనిస్తుంది.


ఆర్థికంగా శుభ ఫలితముంటుంది. ఉద్యోగంలో ప్రశాంతంగా పని చేసుకోవాలి. అడ్డు తగిలేవారున్నారు. వివాదం కన్నా మౌనమే మేలు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. సొంత నిర్ణయాలు లాభాన్నిస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయస్వామిని దర్శిస్తే మంచిది.


ఆర్థికస్థితి మెరుగవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో కష్టాలు తొలగుతాయి. అధికారలాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న ఫలితం ఒకటి ఇప్పుడు వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతా కోరుకున్న విధంగానే జరుగుతుంది. నమ్మించి మోసం చేసేవారున్నారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహస్తుతి మేలు చేస్తుంది.


ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. అభీష్టసిద్ధి ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల సహకారంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ప్రశాంత జీవితం లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. ఒక విషయంలో లాభ పడతారు. ఇష్టదైవస్మరణ శాంతినిస్తుంది.


ఏకాగ్రతతో ప్రయత్నిస్తేనే విజయం లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి.  ఒత్తిడిని తట్టుకుని పనులను పూర్తిచేయాలి. ధనలాభం ఉంది. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భూ-గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. వారాంతంలో శుభవార్త వింటారు. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.


ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. అద్భుతమైన ఫలితాలున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పట్టింది బంగారం అవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగులేని విజయాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. విష్ణుమూర్తి ఆరాధన శ్రేయస్సునిస్తుంది.


ఉద్యోగ ఫలితం శుభప్రదం. అధికారుల ప్రశంసలుంటాయి. కోరుకున్నదే జరుగుతుంది. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. వారం మధ్యలో మేలు జరుగుతుంది. మొహమాటం వల్ల తెలియని సమస్య ఎదురవుతుంది. శివారాధన ఉత్తమం.


ఆర్థికస్థితి క్రమంగా మెరుగవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కొందరివల్ల అశాంతి ఎదురవుతుంది. నిరంతరమైన శ్రమ లక్ష్యాన్ని చేరుస్తుంది. వ్యాపారం కలిసి వస్తుంది. అభీష్టసిద్ధి ఉంటుంది. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. వివాదాలకు తావివ్వవద్దు. ఆదిత్య హృదయం చదివితే మేలు జరుగుతుంది.ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు