close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Horoscope: ఈ వారం రాశిఫలం

గ్రహబలం (మే 16 - మే 22)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఆర్థికాంశాలు ఆనందాన్నిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతయోగముంది. విశేషమైన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపార యోగం అనుకూలం. ఆత్మీయులవల్ల మేలు జరుగుతుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఒక వార్త శక్తినిస్తుంది. ఆదిత్యహృదయం చదవాలి. అంతా శుభమే జరుగుతుంది. 


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యతిరేక కాలం నడుస్తోంది. నిదానంగా సమాధానమివ్వాలి. చెడు ఊహించవద్దు. దగ్గరి వారి సలహాలు పనిచేస్తాయి. నిరంతర కృషితోనే పైకి వస్తారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.


మనోబలంతో విజయం లభిస్తుంది. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి. దేనికీ తొందర పడవద్దు. సమష్టి కృషి మంచిది. అపార్థాలకు తావివ్వకండి. కార్యసిద్ధి గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. పై అధికారుల వల్ల సమస్య ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పనిచేస్తే అన్నీ సర్దుకుంటాయి. ధనలాభం ఉంది. కుజశ్లోకం చదవండి. అంతా మంచే జరుగుతుంది.


ఉద్యోగఫలం శుభప్రదం. పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. నలుగురినీ కలుపుకుపోవాలి. వ్యాపారం బాగుంటుంది. ఆదాయంతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆనందం కలిగించే సందర్భం ఉంది. తీసుకున్న నిర్ణయానికి  కట్టుబడి పనిచేయండి. మంచి భవిష్యత్తు ఏర్పడ బోతోంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. శివారాధన ఉత్తమం.


సర్వశ్రేష్ఠమైన కాలం. మనోభీష్టం నెర వేరుతుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. మిత్ర భావంతో సంభాషించండి. అభిమానించే వారి నుండి ప్రశంసలు లభిస్తాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారంలో జాగ్రత్త. ఆర్థికంగా బాగుంటుంది. ఇష్టదేవతా స్మరణం మేలుచేస్తుంది.


మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఆర్థికస్థితి సహకరిస్తుంది. ఉద్యోగంలో సామాన్య ఫలితముంటుంది. వ్యాపారరీత్యా శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులకు ఆటంకం ఏర్పడవచ్చు. సకాలంలో పనులు మొదలుపెట్టాలి. వారం మధ్యలో తగినంత సహాయం అందుతుంది. ఓర్పుతో సంభాషించాలి. శ్రీరామస్మరణ మంచిది.


దైవబలంతో అదృష్టవంతులవుతారు. ఆర్థికంగా కలిసివస్తుంది. కొందరికి మీవల్ల మంచి జరుగుతుంది. ఉజ్వలమైన భవిష్యత్తు సూచితం. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఒత్తిళ్లు తట్టుకుంటారు. ఆశయం నెరవేరుతుంది. ఆదిత్యహృదయం పఠించండి. శాంతి లభిస్తుంది.


ముఖ్యకార్యాల్లో విజయం సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. అధిక గ్రహాలు వ్యతిరేక ఫలాన్నిస్తున్నాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దృఢసంకల్పంతో మేలు జరుగుతుంది. ఒత్తిడికి లోనవ కూడదు. ఆనందించే అంశాలు ఉన్నాయి. వారాంతంలో ఒక మంచి పని జరుగుతుంది. నవగ్రహ స్తుతి శుభాన్నిస్తుంది.


లక్ష్యం చేరువలోనే ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. మనసుపెట్టి చేసే పనుల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. నలుగురిలో మంచిపేరు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఇష్టదైవస్మరణతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


శ్రేష్ఠమైన సమయం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదురుచూస్తున్న ఫలితం ఒకటి వస్తుంది. ధైర్యసాహసాలు పనిచేస్తాయి. సద్గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగుంటుంది. వ్యాపారంలో తగినంత లాభం రావాలంటే శ్రమ, శ్రద్ధ రెండూ ఉండాలి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సూర్యనమస్కారం శక్తినిస్తుంది.


బుద్ధిబలంతో పనిచేయండి. వ్యాపారంలో కలిసివస్తుంది. ఆపదల నుంచి బయట పడతారు. సంపదలు పెరుగుతాయి. ఒక సమస్య నుండి బయటపడతారు. సత్యనిష్ఠతో జయం లభిస్తుంది. గందరగోళ పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. మిత్రుల సలహా పనిచేస్తుంది. వారాంతంలో పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సూర్యస్తుతి శుభాన్నిస్తుంది.


ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితం ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఉన్నతస్థితి అందు కుంటారు. శాశ్వత ఫలితం ఒకటి లభిస్తుంది. తద్వారా బంగారుమయ జీవితాన్ని నిర్మించ వచ్చు. ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలచుకోగల బుద్ధి నైపుణ్యం లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇష్టదైవ స్మరణతో మేలు జరుగుతుంది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు