రాశిఫలం - Sunday Magazine
close

రాశిఫలం

గ్రహబలం (అక్టోబరు 25-31)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

ముఖ్యమైన అంశాల్లో జాగ్రత్తపడాలి. ఇబ్బంది కలిగించే వారున్నారు. సంయమనాన్ని పాటించండి. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితంఉంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వారాంతంలో శుభం జరుగుతుంది. అభీష్టసిద్ధి ఉంటుంది. శివారాధన శ్రేష్ఠం.


ఆశయం నెరవేరుతుంది. ఆత్మబలంతో కార్యసిద్ధి లభిస్తుంది. మంచితనంతో గౌరవమర్యాదలు పొందుతారు. వారం మధ్యలో శుభ ఫలితం వస్తుంది. ఉద్యోగ పరంగా బాగుంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మేలు జరుగుతుంది.


ముఖ్య కార్యాల్లో శీఘ్రవిజయం ఉంది. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికాంశాలు శుభప్రదం, క్రమంగా వృద్ధిలోకి వస్తారు. బంధుమిత్రుల వల్ల కలసివస్తుంది. వారం మధ్యలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. వారం చివర శుభవార్త వింటారు. అభీష్టసిద్ధి ఉంటుంది. గణేశస్తోత్రం చదివితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది.


మంచికాలం నడుస్తోంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. అధికార లాభముంది. జీవితాశయం ఒకటి సిద్ధిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. వ్యాపారంలో కలసివస్తుంది. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. సుఖసంతోషాలు ఉన్నాయి. మంచి నిర్ణయం తీసుకుంటారు. శత్రుదోషం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించండి, ఆశయం నెరవేరుతుంది.


అద్భుతమైన కాలమిది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఎదురుచూసిన పని అవుతుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని స్మరించండి, ఆరోగ్యం బాగుంటుంది.


వ్యాపారం కలసివస్తుంది. ధనధాన్య లాభముంది. స్థిర చిత్తంతో పనులు ప్రారంభించండి. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. దేనికీ తొందరవద్దు. మనసులో అనుకున్నది జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఇష్టదేవతను ధ్యానించండి. మనశ్శాంతి చేకూరుతుంది.


ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఆపదలు తొలగుతాయి. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి. విజయావకాశాలు ఉన్నాయి. ఒకరి వల్ల మేలు జరుగుతుంది. శాంత స్వభావంతో బంగారు భవిష్యత్తు సాధిస్తారు. శివధ్యానం మంచిది.


అనుకూల ఫలితాలున్నాయి. అంతా శుభమే జరుగుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సున్నితమైన విషయాల్లో దగ్గరివారి సలహా తీసుకోవాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. శుభవార్త వింటారు. ఇష్టదైవస్మరణ శుభప్రదం.


ఇష్టకార్యాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. పోయినవి తిరిగి లభిస్తాయి. మనసులోని కోరికకు కార్యరూపాన్ని ఇవ్వండి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారం బాగుంటుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. సాహసంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఆపదల నుంచి బయటపడతారు. శివనామస్మరణ మంచి చేస్తుంది.


అద్భుతమైన కాలమిది. అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. వ్యాపారంలో బాగా కష్టపడాలి. ఆర్థికంగా కలసివస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఖర్చు విషయంలో జాగ్రత్త. నూతన కార్యాల్లో లాభముంటుంది. ఇష్టదైవ స్మరణతో కార్యసిద్ధి లభిస్తుంది.


ఆర్థికాంశాలు శుభప్రదం. ఉద్యోగంలో మంచి ఫలితం అందుకుంటారు. వ్యాపారపరంగా శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని పనులు చేతిదాకా వచ్చి ఆగిపోతాయి. సహనానికి ఇది పరీక్షగా అనిపిస్తుంది. మనశ్శాంతికి భంగం కలిగించే వారున్నారు. సంయమనాన్ని పాటించండి. సమాజంలో కీర్తిని సంపాదిస్తారు. ఆశయం నెరవేరుతుంది. సూర్యస్తుతి మేలు చేస్తుంది.


పట్టుదలగా పనిచేసి విజయం సాధిస్తారు. తగిన సహాయ సహకారాలు అందుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మంచిని ఎక్కువగా ఊహించండి. వాదాలతో కాలం వృథా కానీయకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. స్వల్పంగా ఆటంకాలు ఎదురైనా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ఓర్పుతో ఉండండి. ఈశ్వర ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న