weekly horoscope: రాశిఫలం (జూన్‌ 13 - 19) - Sunday Magazine
close

weekly horoscope: రాశిఫలం (జూన్‌ 13 - 19)

గ్రహబలం (జూన్‌ 13 - 19)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

మంచి సమయం. ముఖ్యకార్యాలు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగపరంగా స్థిరమైన ఫలితముంటుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధంచేయండి. అదృష్టయోగముంది. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇష్టదైవాన్ని స్మరించండి, ప్రశాంతమైన జీవనం లభిస్తుంది.


కార్యసిద్ధి ఉంది. ఉద్యోగం అనుకూలం.  బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించండి. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో నిదానంగా విజయం వస్తుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. మొహమాటం పనికిరాదు. సుఖ సౌభాగ్యాలుంటాయి. సూర్యస్తుతి మంచిది.


అభీష్టసిద్ధి ఉంది. లక్ష్యం నెరవేరుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. అవరోధాలు క్రమంగా తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ఆవేశపరిచేవారున్నారు. శాంతచిత్తంతో వ్యవహరించాలి. విష్ణుసహస్రనామం చదవండి, శుభవార్త వింటారు. 


ఉద్యోగఫలితం అనుకూలం. ప్రయత్నాల్లో విజయముంటుంది. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఆర్థికస్థితి మధ్యమం. దగ్గరివారి సూచనలు తీసుకుంటూ ధైర్యంగా అడుగు ముందుకేయాలి. ఆనందించే అంశాలున్నాయి. కుటుంబపరంగా కలిసివస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ స్వామిని స్మరించండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. 


అద్భుతమైన శుభయోగాలున్నాయి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతస్థితి గోచరిస్తోంది. పదిమందికీ ఆదర్శవంతులుగా నిలుస్తారు. కొందరికి మీవల్ల మేలు కలుగుతుంది. భూ-గృహ విషయాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఇష్టదైవస్మరణ మంచిది.


శుభ ఫలితాలున్నాయి. అవరోధాలను సునాయాసంగా దాటుతారు. అధికారుల వల్ల శ్రమ ఉంటుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యసిద్ధి పొందుతారు. సాహసకార్యాలు విజయాన్నిస్తాయి. ప్రతి అంశాన్నీ లోతుగా విశ్లేషించండి. వివాదాలజోలికి పోవద్దు. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు జరుగుతుంది.


ఆర్థికస్థితి బాగుంటుంది. అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆటంకాలున్నా ఓర్పుతో లక్ష్యాన్ని చేరగలరు. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. బాధ్యతాయుతంగా ప్రవర్తించి నలుగురికీ ఆదర్శప్రాయులవుతారు. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. వారం మధ్యలో శుభం జరుగుతుంది. సూర్యనమస్కారం మంచిది.


ముఖ్యకార్యాల్లో విజయముంటుంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరత్వం వస్తుంది. వెతుకుతున్నది ఒకటి దొరుకుతుంది. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. తెలియని ఆటంకం అశాంతి కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే సంకల్పం నెరవేరుతుంది.


ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. ఆశయం సిద్ధిస్తుంది. పెద్దల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా ఆలోచనాసరళిని మార్చుకోవాలి. ఆశయం ఉన్నతంగా ఉంటే కార్యసిద్ధి కూడా విశేషంగానే ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా లాభపడతారు. శివారాధన ఉత్తమం.


కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో పెద్దల సహకారం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచితే శ్రేష్ఠమైన ఫలితం లభిస్తుంది. వారం మధ్యలో ఒక ఆటంకం ఎదురవుతుంది. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. విష్ణుస్మరణ శక్తినిస్తుంది.


ఇష్టకార్యసిద్ధి ఉంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖసంతోషాలున్నాయి. ధనలాభం ఉంది. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. విఘ్నాలను అధిగమిస్తారు. మీ మంచితనం మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. ధర్మమార్గంలో పైకి వస్తారు. పదిమందికీ మేలు చేస్తారు. కుటుంబం విషయంలో అభివృద్ధిని సాధిస్తారు.సూర్యస్తుతి శుభాన్నిస్తుంది.


ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలున్నాయి. పలుమార్గాల్లో పైకి వస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం. దగ్గరివారి సలహాలు తీసుకోండి. వారం మధ్యలో ఒక ప్రయత్నం ఫలిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఈర్ష్యాపరుల వల్ల శ్రమ పెరుగుతుంది. శాంతంగా ఆలోచించండి. శివారాధన మనోబలాన్నిస్తుంది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న