Weekly Horoscope: రాశిఫలం - Sunday Magazine
close

Weekly Horoscope: రాశిఫలం

గ్రహబలం (జులై 4 - 10)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

విశేషమైన శుభకాలం నడుస్తోంది. అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడు చేసే పనులు త్వరగా విజయాన్నిస్తాయి. జీవితానికి అవసరమైన స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపార యోగం చాలా బాగుంటుంది. అంచలంచెలుగా పైకి వస్తారు. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. కీర్తి లభిస్తుంది. సంపదలు సమకూరుతాయి. లక్ష్మీధ్యానం శుభాన్నిస్తుంది.


ముఖ్యకార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రద్ధగా పనిచేసి పెద్దలను మెప్పించండి. అధికారలాభం సూచితం, ధైర్యంగా ముందడుగు వేయండి. ధర్మం గెలిపిస్తుంది. క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. ఇంట్లోవారి సూచనలు పనిచేస్తాయి. వారం మధ్యలో ఒక శుభఫలితం ఉంది. శివారాధన మనశ్శాంతినిస్తుంది.


అద్భుతమైన కాలమిది. ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఒక విషయంలో లాభపడతారు. బంగారు భవిష్యత్తుకు తగిన ప్రణాళిక వేసుకోండి. స్వల్ప ఆటంకాలుంటాయి. ఓర్పుతో వాటిని అధిగమించండి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆదిత్యహృదయం చదవండి, ప్రశాంతత లభిస్తుంది.


అనుకూల సమయమే. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికారబలం పెరుగుతుంది. దగ్గరివారితో ప్రేమగా మాట్లాడాలి. మిత్రులబలంతో ఒక విజయం లభిస్తుంది. ధర్మబద్ధంగా పనిచేయండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. కొందరికి మీవల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. గురుశ్లోకం చదివితే ఫలితం ఉంటుంది.


అధికార లాభం సూచితం. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. ఆటంకాలను తెలివిగా అధిగమించాలి. అసహనానికి గురికావద్దు. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ప్రతిఫలం వస్తుంది. కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది. వ్యాపారపరంగా శ్రద్ధ చూపాలి.  పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇష్టదేవతను దర్శిస్తే మంచిది.


ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. పెద్దల సహకారంతో మంచి గుర్తింపు లభిస్తుంది. సుస్థిరత ఏర్పడుతుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. తగినంత ధనం అందుతుంది. తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. సహనం రక్షిస్తుంది. ఒక వార్త సంతోషాన్నిస్తుంది. శ్రీరామనామాన్ని స్మరించండి, సుఖం లభిస్తుంది.


మనోబలం అవసరం. సొంత నిర్ణయాలు మంచిది కాదు. ముఖ్యకార్యాల్లో తోటివారి సలహాలు తీసుకోండి. ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించాలి. తొందరపాటువల్ల కొత్త సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్త. ఆర్థికంగా అనుకూలత కనిపిస్తోంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, కార్యసిద్ధి ఉంటుంది.


అభీష్టసిద్ధి ఉంటుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి వెంటనే పూర్తవుతుంది. పెద్దల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ధనలాభం ఉంది. అనుకున్న విధంగానే జీవితం ముందుకు సాగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ధర్మమార్గంలో లక్ష్యాన్ని చేరతారు. సుఖసంతోషాలుంటాయి. ఉద్యోగవ్యాపారాల్లో ఓర్పు అవసరం. సూర్యధ్యానం శక్తినిస్తుంది.


వ్యాపారలాభం ఉంది. నూతన ప్రయత్నాల్లో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సకాలంలో పనిచేసి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగరీత్యా శుభఫలితముంటుంది. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబపరంగా ఆనందించే అంశాలుంటాయి. అవగాహనతో గొప్ప జీవితానికి పునాది వేసుకోవాలి. ఇష్టదేవతను తలచుకోండి, శాంతి చేకూరుతుంది.


ఆత్మవిశ్వాసంతో తిరుగులేని విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మొహమాటంతో ఖర్చు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. భూ, గృహ వాహన లాభాలున్నాయి. దుర్గాదేవిని స్మరించండి, మంచి జరుగుతుంది.


కార్యసిద్ధి ఉంది, ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న ఫలితం సాధించండి. అధికారుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఆనందించే అంశం ఒకటి ఉంటుంది. ధనలాభం పొందుతారు. సాహసపూరిత నిర్ణయాలు అనుకూలిస్తాయి. మిత్రులతో విభేదించడానికి ఇది సమయం కాదు. ఓర్పు విజయాన్నిస్తుంది. ఇష్టదైవదర్శనం శాంతినిస్తుంది.


శుభయోగముంది. కోరికలు నెరవేరతాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఎదురుచూస్తున్న పనిలో పురోగతి గోచరిస్తోంది. కుటుంబపరమైన సంతృప్తిని పొందుతారు. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆంజనేయస్వామి స్మరణ మేలుచేస్తుంది.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న