close
విశ్వ భారతం!

విశ్వ భారతం!

భారత్‌ అంటే కేవలం ఒక దేశం కాదు... ఓ సంస్కృతి, ఓ సంప్రదాయం. ఆ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రపంచం నలుమూలలకూ తీసుకువెళ్లారు మనవాళ్లు. అంతేకాదు, ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా...’ అన్న రాయప్రోలు మాటల్ని అక్షరాలా నిజం చేస్తున్నారు. ప్రవాస భారతీయుల దినోత్సవం (జనవరి 9) సందర్భంగా మనమంతా గర్వపడే ఆ విషయాల్ని ఓసారి గుర్తుచేసుకుందాం!

భారత ప్రభుత్వం లెక్కల ప్రకారం డిసెంబరు 2018నాటికి విదేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య 3,09,95,729. వీరిలో ప్రవాస భారతీయులు 1.31కోట్లుంటే... భారతీయ మూలాలున్న వారు 1.78కోట్లు.
* అత్యధికంగా ప్రవాస భారతీయులున్న దేశాలు... యూఏఈ (31 లక్షలు), సౌదీ అరేబియా (28 లక్షలు), అమెరికా (12.8లక్షలు), కువైట్‌(9.28లక్షలు), ఖతార్‌ (6.91 లక్షలు), ఒమన్‌(6.8లక్షలు), నేపాల్‌ (6లక్షలు), యూకే (3.2లక్షలు).
* సౌదీ అరేబియా జనాభాలో 9.8 శాతం భారతీయులే! స్థానికుల తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నది  భారతీయులే.
* ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం 2018లో భారత్‌కు ప్రవాసులు పంపిన మొత్తం రూ.5.6 లక్షల కోట్లు. ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపిస్తున్నది మనవాళ్లే.
* భారత మూలాలున్న వ్యక్తులు అధికంగా ఉన్న దేశాలు మలేసియా (27లక్షలు), మయన్మార్‌ (20లక్షలు), శ్రీలంక (16లక్షలు), దక్షిణాఫ్రికా (15లక్షలు), యూకే (15లక్షలు), మారిషస్‌ (8.8లక్షలు), ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో (5.5 లక్షలు), సింగపూర్‌ (3 లక్షలు).
* భారత్‌ వెలుపల అత్యధికంగా మనవాళ్లు ఉన్నది అమెరికాలో. అక్కడ 44 లక్షల మంది ఉన్నారు. వారిలో 12.8 లక్షల మంది ప్రవాసులు, 31లక్షల మంది భారత సంతతికి చెందినవాళ్లు.
* భారత్‌ వెలుపల అతిపెద్ద భారతీయ నగరంగా దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ను చెబుతారు. అక్కడ దాదాపు లక్షమంది భారత సంతతి ప్రజలు ఉంటారు.
* 12.6 లక్షల జనాభా ఉన్న మారిషస్‌లో 68 శాతం భారతీయ మూలాలున్నవారే.
* ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధికంగా వలస వెళ్లింది భారతీయులే.
* అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడిన ప్రవాస భారతీయుడు సౌరభ్‌ నేత్రవాల్కర్‌, ఆ దేశ జాతీయ క్రికెట్‌ జట్టుకి కెప్టెన్‌!

విశ్వ భారతం!

 

విశ్వ భారతం!

 

విశ్వ భారతం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.