close
మస్త్‌... మస్త్‌... మ్యాంగో ఖీర్‌..!

మామిడి ఖీర్‌

కావలసినవి
మామిడిపండు గుజ్జు: కప్పు, సన్నగా తరిగిన మామిడిపండ్ల ముక్కలు: కప్పు, బియ్యం: 200 గ్రా., యాలకులపొడి: టీస్పూను, జీడిపప్పు, బాదం: 2 టేబుల్‌స్పూన్లు, పాలు: లీటరు, నెయ్యి: టేబుల్‌స్పూను, కోవా: 100 గ్రా.

తయారుచేసే విధానం
* కాస్త నెయ్యిలో సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసి వేయించాలి.
* పాలల్లో బియ్యం వేసి ఉడికించాలి. తరవాత పంచదార వేసి కరిగించాలి. కోవా, వేయించిన జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, యాలకులపొడి వేసి కలపాలి. తరవాత మామిడిపండు గుజ్జు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు కూడా వేసి చల్లగా గానీ వేడిగా గానీ అందించాలి.

ఎగ్‌లెస్‌ మ్యాంగో కేక్‌

కావలసినవి
మైదా: ఒకటిన్నర కప్పులు, కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, బేకింగ్‌ పౌడర్‌: ఒకటిన్నర టీస్పూన్లు, బేకింగ్‌ సోడా: అరటీస్పూను, వినెగర్‌: 2 టీస్పూన్లు, నెయ్యి: ముప్పావుకప్పు, పంచదార: అరకప్పు, మామిడిపండ్ల గుజ్జు: కప్పు, పాలు: అరకప్పు

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. తరవాత వినెగర్‌, నెయ్యి, పంచదార, మామిడిపండ్ల గుజ్జు వేసి పంచదార కరిగిపోయేవరకూ కలపాలి. తరవాత పాలు కూడా పోసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఓవెన్‌ బౌల్‌లో వేసి 180 డిగ్రీలకు వేడిచేసిన ఓవెన్‌లో పెట్టి సుమారు అరగంటసేపు బేక్‌ చేయాలి. లేదా కుక్కర్‌ అడుగుభాగంలో నెయ్యి రాసి మిశ్రమాన్ని పోసి సిమ్‌లో ఇరవై నిమిషాలు ఉడికించినా కేక్‌ తయార్‌. బయటకు తీశాక కాస్త పంచదార వేసి బాగా గిలకొట్టిన క్రీమ్‌తో కావలసినట్లుగా ఐసింగ్‌ చేసుకుంటే సరి.

కలాకంద్‌

కావలసినవి
పాలు: లీటరు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పంచదార: కప్పు, మామిడిపండ్ల గుజ్జు: కప్పు, డ్రైనట్స్‌(జీడిపప్పు, బాదం, పిస్తా): కప్పు

తయారుచేసే విధానం
* పాలు కాగాక అందులో నిమ్మరసం వేసి విరగ్గొట్టాలి. విరిగిన తరవాత స్టవ్‌ ఆఫ్‌ చేసి పాలవిరుగుడులో పైకి తేలిన నీళ్లన్నీ వంపేయాలి.
* పాన్‌లో పంచదార, మామిడిపండ్ల గుజ్జు వేసి బాగా కలపాలి. తరవాత పాల విరుగుడు కూడా వేసి బాగా తిప్పుతూ ఉడికించాలి. పది నిమిషాల తరవాత జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు, యాలకులపొడి వేసి అంచుల నుంచి విడిపోయే వరకూ ఉడికించి దించి నెయ్యి రాసిన ప్లేటులో పోసి చల్లారిన తరవాత కావలసిన ఆకారంలో కోసుకుంటే సరి.

ఐస్‌క్రీమ్‌

కావలసినవి
పాలు: 2 కప్పులు, క్రీమ్‌: 3 కప్పులు, మ్యాంగో ప్యూరీ: కప్పు, మామిడిముక్కలు: కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌: టేబుల్‌స్పూను, వెనీలా ఐస్‌క్రీమ్‌: కప్పు, పంచదార: ఒకటిన్నర కప్పులు

తయారుచేసే విధానం
* పాలను కాచాలి. పావు కప్పు పాలు విడిగా తీసి చల్లారాక కస్టర్డ్‌ పౌడర్‌ వేసి కలిపి పక్కన ఉంచాలి.
* మిగిలిన పాలల్లో పంచదార వేసి మరిగించాలి. అవి బాగా మరిగిన తరవాత  చల్లారనివ్వాలి. తరవాత అందులో మామిడిపండ్ల ప్యూరీ, ముక్కలు, క్రీమ్‌, వెనీలా ఐస్‌క్రీమ్‌ వేసి బాగా కలిపి ఫ్రీజర్‌లో పెట్టాలి. కాస్త గడ్డకట్టిన తరవాత బయటకు తీసి ఐస్‌క్రీమ్‌ మేకర్‌లోగానీ మిక్సీలోగానీ వేసి బాగా తిప్పి మళ్లీ గిన్నెలో వేసి ఫ్రీజర్‌లో పెట్టి గడ్డకట్టిన తరవాత తీసి అందించాలి.

మ్యాంగో మస్తానీ

కావలసినవి
మామిడిపండ్ల గుజ్జు: 2 కప్పులు, పాలు: కప్పు, తాజా క్రీమ్‌: కప్పు, పంచదార: 3 టేబుల్‌స్పూన్లు, వెనీలా ఐస్‌క్రీమ్‌: రుచికి సరిపడా, బాదం, పిస్తా, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* పాలు, క్రీమ్‌, ఐస్‌ ముక్కలు, మామిడిపండ్ల గుజ్జు అన్నీ మిక్సీలో వేసి బాగా గిలకొట్టి గ్లాసుల్లో పోసి అందులోనే వెనీలా ఐస్‌క్రీమ్‌ వేసి, డ్రైఫ్రూట్‌ ముక్కలతో అలంకరించాలి. కావాలనుకుంటే కాసిని మామిడిపండ్ల ముక్కలు కూడా వేసుకోవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.