Array
(
    [0] => stdClass Object
        (
            [magzine_id] => 13017
            [magzine_title] => కాఫీ ‘చిత్రం’ చూడర బాబూ..!

        )

)
కాఫీ ‘చిత్రం’ చూడర బాబూ..! - Sunday Magazine - EENADU కాఫీ ‘చిత్రం’ చూడర బాబూ..! - Sunday Magazine
close
కాఫీ ‘చిత్రం’ చూడర బాబూ..!

కాఫీ... ఆ వాసనకు పడిపోయే వాళ్లు కొందరయితే, రుచికి ఫిదా అయ్యేవాళ్లు ఇంకొందరు. కానీ ఇక నుంచీ మాత్రం దాని అందానికి ఎవరైనా దాసోహమవ్వాల్సిందే. అదేంటి, కాఫీ అందంగా ఉంటుందా అనుకోకండి... ఇక్కడ కనిపిస్తున్నవన్నీ రకరకాల రంగుల్లోని చూడచక్కని బొమ్మల్ని తనలో పొదవుకున్న కాఫీ కప్పులే మరి!

కాఫీ పొడీ పాల నురగల్ని కలుపుతూ కాఫీ కప్పులో వేసే లాటెఆర్ట్‌ మనకు సుపరిచితమే. హృదయాకారాలూ, సీతాకోక చిలుకలూ, చెట్ల కొమ్మలూ, వింతైన డిజైన్లను కాఫీ మీద ఆవిష్కరిస్తుందీ కళ. అయితే ఇన్నాళ్లూ అవన్నీ తెలుపూ, కాఫీ రంగుల్లోనే ఉండేవి. కాలం ముందుకెళ్లే కొద్దీ ఆహార పదార్థాల అలంకరణకు ప్రాధాన్యం పెరిగిపోతూనే ఉంది. రుచిగా వండటమే కాదు అంతే శ్రద్ధగా చూడచక్కగా అలంకరించి వినియోగదారులకు వడ్డించడమూ ఇప్పుడు ముఖ్యమైన విషయమైపోయింది. అందులో ఎవరు ముందుంటే వాళ్లే కస్టమర్ల మనసు గెలుచుకుంటున్నారు. మొత్తానికి తినేవాళ్లలో పెరిగిన ఆహార అలంకరణ మీద ఇష్టం, తయారీదారుల్లో అధికమవుతున్న సృజనాత్మకతల కారణంగా ఇప్పుడు కాఫీ కప్పూ కాన్వాసులా మారిపోయింది. అచ్చెరువొందించే పెయింటింగుల్నీ, అందాల బొమ్మల్నీ, ముద్దులొలికే కార్టూన్‌ క్యారెక్టర్లనీ, పువ్వుల్నీ, తీగల్నీ అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటూ చూసేవాళ్ల మనసు దోచుకుంటోంది. ఈ అందాల కళను కలర్డ్‌ లాటె ఆర్ట్‌గా పిలుస్తున్నారు. ఇందులో కాఫీ మీద ముందుగా క్రీమ్‌ను వేసి దాని మీద పాల నురగను పోస్తారు, దాని పైన ఫుడ్‌ కలర్లు చల్లి వాటి సాయంతో నేర్పుగా కావాలనుకున్న అందమైన బొమ్మల్ని రూపొందిస్తారు. కొన్నిసార్లు పాల నురగలోనే రంగులు కలిపీ వీటిని చేస్తారు. అలా కాఫీ కప్పును చూడగానే కళ్లను కట్టిపడేసేలా మార్చి మన చేతికి అందిస్తారు. కొరియాకు చెందిన లీ కాంగ్‌ బిన్‌ అనే కుర్రాడు కాఫీ మీద ఇలాంటి బొమ్మలు వేయడంలో మహా నేర్పరి. నెట్లో బాగా ప్రాచుర్యం పొందిన అతడి కాఫీ బొమ్మలు ఫొటోషాప్‌లో చేశారేమో అనిపిస్తూ అందరి మన్ననలూ అందుకుంటున్నాయి. అన్నట్టూ, ఈ కాఫీ చూసేందుకే కాదు, తాగేందుకూ ఎంతో రుచిగా ఉంటుందని చెబుతున్నారు తయారీదారులు. వాళ్లు చెబుతారు కానీ, ఇంత చక్కగా వేసిన బొమ్మల్ని గుటుక్కుమనిపించాలంటే మనసొప్పడం కాస్త కష్టమే..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.