close

కాబోయేవాడు ఎలా ఉండాలంటే...!

చిక్కినట్టే చిక్కి రెండుసార్లు చేజారిన ప్రపంచకప్‌ను పట్టుబట్టి చేజిక్కించుకున్న పీవీ సింధు స్వర్ణం అనే పదానికి కేరాఫ్‌గా మారింది. ఆడపులిలా గర్జిస్తూ బుల్లెట్‌లా బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతోంది. మరి ఆ బంగారు కొండ ఇష్టాయిష్టాలేంటో తెలుసా...

 

అభిమానించే ఆటగాళ్లు

నాన్న, నా గురువు పుల్లెల గోపీచంద్‌, సచిన్‌ల ఆటతీరు నచ్చుతుంది. 

తీరిక దొరికితే...

నాకెంతో ఇష్టమైన బీఎమ్‌డబ్ల్యూ 320డి డ్రైవ్‌ చేస్తా. 

నచ్చిన నటులు

హేశ్‌బాబు, ప్రభాస్‌లకి పెద్ద ఫ్యాన్‌ని. కుదరాలేగానీ థియేటర్‌కి వెళ్లి మరీ సినిమాలు చూస్తా. 

నచ్చే హాలిడేస్పాట్‌

ప్యారిస్‌. ఇప్పటి వరకూ ఈఫిల్‌ టవర్‌ చూడలేదు. అదొక్కటే లోటు.

ఇష్టంగా తినేవి

హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ విత్‌ మటన్‌ కీమా, చేపల పులుసు, పెరుగు అంటే చాలా ఇష్టం. 

బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కాకుంటే...

ఎంబీబీఎస్‌ చదివి అక్కలా డాక్టర్ని అయ్యేదాన్ని. లేదంటే అథ్లెట్‌ అయ్యేదాన్ని. 

బలం బలహీనత

గెలుపోటముల్ని ఒకేలా తీసుకోవడం నా బలం.  ముక్కు మీద కోపం బలహీనత.

ఇతరుల్లో నచ్చనివి

బద్ధాలాడటం, రూమర్లు స్ప్రెడ్‌ చేయడం, అతిగా మాట్లాడటం వంటివి అస్సలు నచ్చవు.

కాబోయే భర్త

నాకంటే ఎత్తుండాలి. ఇతరులకి సాయం చేసే గుణం ఉండాలి. 

ఫాలో అయ్యేది 

న్‌స్టాగ్రామ్‌. అందులో మోర్‌ ఫన్‌ ఉంటుంది. అప్పుడప్పుడూ ట్విటర్‌లో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతుంటా.

మీ ఫిలాసఫీ

పాజిటివ్‌గా ఉండటం, నచ్చింది చేయడం, సంతోషంగా బతకడం

బాధపడిన సందర్భం

ఖనవూలో టోర్నమెంట్‌ ఆడుతూ అక్క పెళ్లికి వెళ్లలేకపోయా. ఆరోజెంతో బాధపడ్డా.

ఒత్తిడికి మందు 

షాపింగ్‌ చేస్తా. ఎక్కువగా బట్టలూ, మేకప్‌ సామగ్రి కొంటుంటా. 

మార్చుకోవాల్సింది!

టకి ముందు గోళ్లు కొరకడం. ఆ ఆలవాటు మానుకోవాలి.

గోపీ తరచూ చెప్పేది...

మయం వృథా చేయొద్దూ, చక్కెర తినొద్దూ, ఫోన్‌ వాడొద్దూ అని ఎప్పుడూ చెబుతుంటారు. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.