
ప్రపంచంలోనే పెద్ద పక్షిది!
జటాయువు... రామాయణంలోని అరణ్యకాండలో చెప్పుకోగదిన పాత్ర. రావణుడు సీతను అపహరించినప్పుడు అడ్డుపడి వీరోచితంగా పోరాడుతుంది జటాయువు అనే గద్ద. ఆ సమయంలో రావణుడు దాని రెక్కలు విరిచి నేల కూలుస్తాడు. కొండలపైన పడిపోయిన ఆ జటాయువు సీతాపహరణం గురించి రాముడికి వివరించి ప్రాణాలొదులుతుంది. ఆ ప్రాంతం ఉన్నది కేరళలోని కొల్లాం జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలోని చాడాయమంగళం అని విశ్వాసం. దాన్నిప్పుడు కేరళ ప్రభుత్వం జటాయు నేషనల్పార్కుగా అభివృద్ధి చేసింది. గద్ద ఆకృతిలో 200 అడుగుల ఎత్తూ... 150 అడుగుల వెడల్పుతో రూపొందించిన పక్షి శిల్పం ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు పొంది గిన్నిస్‌లోకి ఎక్కింది. రాజీవ్ అంచల్ అనే దర్శకుడు కేరళ ప్రభుత్వం అనుమతితో దాదాపు పదేళ్లపాటు శ్రమించి ఆ పార్కును అభివృద్ధి చేశాడు. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు కనుచూపుమేర పచ్చనికొండలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉండే ఈ కాలంలోనైతే పాలనురగంటి పొగమంచును పచ్చని కొండలు తరిమేస్తున్నట్టు కనువిందు చేస్తుంది అక్కడి వాతావరణం.
8 డిసెంబరు 2019
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్