close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (డిసెంబరు 8 - 14)

మంచికాలం నడుస్తోంది. ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది. సుఖసంతోషాలు ఉంటాయి. ధైర్యంగా పనిచేయండి. ఉద్యోగబలం ఉంది. రుణ సమస్యలు ఇబ్బంది కలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. సామరస్య ధోరణితో ఉపద్రవం తప్పుతుంది. వారాంతంలో లక్ష్యాన్ని చేరుకుంటారు. శివారాధన శ్రేష్ఠం.

ఆవేశం పనికిరాదు. ప్రతిదీ లోతుగా ఆలోచించండి. సమష్టి కృషితో లాభపడతారు. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. భూలాభం ఉంటుంది. శాంతచిత్తంతో వ్యవహరించండి. పట్టుసడలకుండా ప్రయత్నిస్తూనే ఉండండి. అధికారులతో విభేదం వద్దు. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. దత్తాత్రేయ స్వామిని స్మరించండి.

శుభకాలం నడుస్తోంది. అదృష్టఫలం  అందుతుంది. అంతా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. అధికారబలం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆత్మీయుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అనుకోని లాభం ఉంది. జ్ఞానవృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారలాభం సూచితం. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవండి.

ముఖ్యకార్యాల్లో విజయం సాధిస్తారు. అవగాహనతో పనిచేయండి. దైవబలం కాపాడుతోంది. అధికారుల ప్రశంసలుంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యసిద్ధి ఉంది. తగినంత ప్రయత్నం చేయాలి. శ్రమ పెరుగుతుంది. విశేష ప్రయత్నం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. అపార్థాలకు తావివ్వరాదు. మనోబలంతో అన్నీ సిద్ధిస్తాయి. ఇష్టదేవతను స్మరించండి.

అద్భుతమైన కాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి ఉంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు శుభఫలితాన్నిస్తాయి. కుటుంబపరమైన అభివృద్ధిని సాధిస్తారు. మనసులోని కోరిక వారాంతంలో తీరుతుంది. శత్రుదోషం తొలగుతుంది. సూర్యారాధన మంచిది.

త్రికరణశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. ఆత్మబలంతో ముందడుగు వేయండి. దేనికీ సంకోచించరాదు. లక్ష్యం దగ్గరలోనే ఉంది. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ముందస్తు ప్రణాళికల ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు. ఆంజనేయస్వామిని ధ్యానించండి. శుభం జరుగుతుంది.

శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. మీరు  కోరుకున్న విధంగా జరుగుతుంది. స్వయంగా చేసే పనుల్లో సత్వర ఫలితం ఉంటుంది. మిత్రుల వల్ల లాభపడతారు. మొహమాటం వద్దు. స్పష్టమైన నిర్ణయంతో ముందడుగు వేయండి. స్థిరాస్తి వృద్ధి  చెందుతుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. ఆనందించే విషయం ఒకటుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

అనుకూల సమయం నడుస్తోంది. స్వస్థానప్రాప్తి ఉంటుంది. మంచి పనులతో బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు. మీ మేలు కోరేవారున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం వస్తుంది. ఎదురుచూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. అధికార లాభముంటుంది. ఆర్థికాంశాలు శుభప్రదం. శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

పనుల్లో వేగం పెంచండి. ఆటంకాలను తెలివిగా అధిగమించండి. ఆత్మబలంతో ముందడుగు వేస్తే తిరుగులేని ఫలితం వస్తుంది. వాయిదా లేకుండా పనులు పూర్తిచేయండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి. ఆర్థికపరంగా శుభఫలితముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆంజనేయస్వామిని స్మరించండి.

మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఒత్తిళ్ళను తట్టుకుని ముందడుగు వేయాలి. బుద్ధిబలంతో పనిచేయండి. ఉత్తమ ఫలితం వస్తుంది. మిత్రుల  సహకారం అందుతుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తిచేయాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విష్ణుసహస్రనామం చదువుకోవాలి.

అద్భుతమైన ఫలితాలున్నాయి. ప్రయత్నపూర్వక విజయం సిద్ధిస్తుంది. ఇంటా బయటా మేలు జరుగుతుంది. గృహ భూ వాహనాది యోగాలున్నాయి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. అభీష్టసిద్ధి ఉంది. బంధాలు  బలపడతాయి. ఆనందించే అంశాలున్నాయి. వాటిని బుద్ధిబలంతో వశం చేసుకోవాలి. ఇష్టదేవతా స్మరణతో లాభపడతారు.

ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. కాలం సహకరించడం లేదు. చిత్తశుద్ధితో పనిచేయాలి. శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కలహాలకు తావివ్వకండి. వృథా ప్రసంగాలతో అశాంతి నెలకొంటుంది. కుటుంబసభ్యుల సహకారంతో ముందుకు సాగితే ఏ సమస్యా రాదు. వారాంతంలో కార్యసిద్ధి ఉంటుంది. నవగ్రహ స్తోత్రం పఠించండి.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు