close
రాశిఫలం

గ్రహబలం (డిసెంబరు 15 - 21)


ఆర్థికాంశాలు బాగుంటాయి. పట్టుదలతో విజయం లభిస్తుంది. మంచి మనసుతో పనులు ప్రారంభించండి. ఒత్తిడి కలిగించే అంశాలున్నాయి. నిర్ణయం తీసుకోవడంలో తడబాటు వద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమకాలం నడుస్తోంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. బుద్ధిబలాన్ని ఉపయోగించండి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


మనోబలంతో ఉత్తమ ఫలితం సాధించండి. సమయస్ఫూర్తి అవసరం. క్రమశిక్షణతో పనిచేయండి. అనుకున్నది దక్కుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ ధర్మం వీడరాదు. సాహసోపేత నిర్ణయం ముందుకు నడిపిస్తుంది. ధనలాభం ఉంది. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. సూర్య నమస్కారం ఆశయ సాధనకు ఉపకరిస్తుంది.
 


అదృష్టయోగముంది. తగినంత ప్రయత్నం అవసరం. అధికారుల నుంచి ప్రశంసలుంటాయి. ఆత్మబలం పెరుగుతుంది. మనోధైర్యంతో లక్ష్యం సిద్ధిస్తుంది. శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వారంమధ్యలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. నిజాయతీ రక్షిస్తుంది. కుటుంబసభ్యుల సహకారంతో ఆనందం సిద్ధిస్తుంది. లక్ష్మీ ఆరాధన ఉత్తమం.
 


ఆచితూచి వ్యవహరిస్తే విజయం తథ్యం. లక్ష్యం సిద్ధించేవరకు శ్రమిస్తూనే ఉండండి. పట్టుదలతో అనుకున్నది సాధించవచ్చు. దైవబలం రక్షిస్తుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి పనిచేయండి. దృఢసంకల్పం అవసరం. అభీష్టసిద్ధి ఉంది. ఆదిత్యహృదయం చదువుకోవాలి.
 


అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ధర్మచింతనతో అభివృద్ధిని సాధిస్తారు. స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగండి. వ్యాపారలాభం విశేషంగా ఉంటుంది. కష్టానికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. స్వశక్తితో పైకి వస్తారు. పనుల్లో నిబద్ధత పెరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇష్టదేవతా స్మరణ మంచిది.
 


చక్కని కార్యసిద్ధి ఉంది. లక్ష్యంపై దృష్టిపెట్టండి. ధన, ధాన్య లాభాలుంటాయి. ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. విఘ్నాలున్నా సునాయాసంగా అధిగమిస్తారు. గృహ, వాహనాది లాభాలున్నాయి. ఎవరితోనూ గొడవలు వద్దు. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం.


మంచి కాలం నడుస్తోంది. అదృష్టఫలాలు అందుతాయి. బుద్ధిబలంతో సరైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార లాభముంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఏకాగ్రతకు భంగం కలిగించే వారుంటారు. సంయమనంతో ముందుకు సాగాలి. ఉపద్రవాల నుండి బయటపడతారు. పొదుపు అవసరం. ఇష్టదేవతా స్మరణ మేలుచేస్తుంది.


ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. ప్రయత్నం బలంగా చేయండి. మిత్రుల వల్ల విజయం లభిస్తుంది. శాంతి చేకూరుతుంది. ఆత్మబలం అవసరం. బుద్ధి నైపుణ్యంతో
ప్రశంసలు పొందుతారు. సమాజంలో తగినంత గౌరవం లభిస్తుంది. అదృష్టయోగముంది. శివారాధన మనోబలాన్నిస్తుంది.


ఆర్థికంగా అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఏకాగ్రచిత్తంతో విజయం సాధిస్తారు. ఒత్తిడిని జయించండి. లక్ష్యం సిద్ధించే క్రమంలో అవరోధాలు ఇబ్బందిపెడతాయి. గందరగోళ పరిస్థితులున్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రమాదం ఉండదు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆత్మీయుల ద్వారా శాంతి లభిస్తుంది. వెంకటేశ్వర స్వామిని స్మరించండి.


ఆశయం సిద్ధిస్తుంది. ఆత్మబలంతో లక్ష్యాన్ని చేరతారు. శుభయోగముంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మంచి పనులు చేసి కీర్తిని గడిస్తారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. అధికారుల అండ లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శ్రద్ధపెట్టి పనిచేస్తే విఘ్నాలు దరిచేరవు. భూ, గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణునామస్మరణ శుభాన్నిస్తుంది.


అదృష్టకాలం నడుస్తోంది. పట్టింది బంగారం అవుతుంది. నిర్మలమైన మనసుతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. విశేషమైన గౌరవాన్ని పొందుతారు. అద్భుతమైన ఆలోచనలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. సమష్టి నిర్ణయం కలసివస్తుంది. మంచిపనులకు శ్రీకారం చుట్టండి. ఆశయం నెరవేరుతుంది. శుభవార్త వింటారు. శివనామస్మరణ ఆనందాన్నిస్తుంది.


ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. చంచలత్వం రానీయవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. మనోధర్మం రక్షిస్తుంది. సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. సహనంతో పనిచేయాలి. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. మౌనం సమస్యలను పరిష్కరిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.