close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూది లేకుండా టీకా

టీకాల మాట ఏమోగానీ, వాటి కోసం పొడిచే సూదుల గాట్లు జీవిత కాలం కొంతమంది శరీరాల మీద పెద్ద మచ్చల్లా మిగిలిపోతుంటాయి. పైగా, చిన్న పిల్లలు సూదులు పొడుస్తుంటే నొప్పితో విలవిలలాడిపోతారు. ఈ బాధలు ఇక మీదట ఉండవు. ఈ మధ్యనే ఆవిష్కరించిన ఇమ్యునోవ్యాక్సిన్‌ ప్యాచ్‌లతో ఇంజక్షన్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేయొచ్చు! ఈ ప్యాచ్‌ చూడటానికి ఒక చిన్న స్టిక్కర్‌లా ఉంటుంది. దాని మధ్యలో ఉండే చిన్నపాటి ముళ్లలో వ్యాక్సిన్‌ ఉంటుంది. ప్యాచ్‌ను కాసేపు చర్మం మీద అదిమి పెట్టుకుంటే వ్యాక్సిన్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నొప్పి లేకుండా వ్యాక్సినేషన్‌ అయిపోతుంది. ఈ ఆవిష్కరణ వల్ల మెడికల్‌ వ్యర్థాలు తగ్గటంతో పాటు, కోట్ల రూపాయలు ఆదా అవుతాయట. పైగా ఈ వ్యాక్సిన్‌ ప్యాచ్‌లను శీతల పెట్టెల్లో ఉంచాల్సిన అవసరమూ ఉండదట!


‘గాలి కనబడుతోందా?’ అని ఒక సినిమాలో అమాయకంగా అడుగుతూ ఎదుటివ్యక్తిని ఏడిపిస్తాడు ఏవీఎస్‌. స్నేహితుల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఆటపట్టిస్తుంటారు కొందరు. దానికి సమాధానంగా ఇక మీదట, ‘అవును కనిపిస్తోందిగా! అదిగో అక్కడ రాయిలా ఉంది!’ అని నిబ్బరంగా సమాధానమివ్వవచ్చు మనం! అదెలా అంటారా? కార్బన్‌డయాక్సైడ్‌ని రాయిగా మార్చే పద్ధతిని ఈమధ్యనే కనుక్కున్నారు శాస్త్రవేత్తలు! అగ్నిపర్వతాల్లో దొరికే రాయిని (వొల్కానిక్‌ బసాల్ట్‌ రాక్‌) ద్రవరూపంలో అధిక పీడనానికి గురవుతున్న బొగ్గుపులుసు వాయువు (‘్న2)లోకి పంపి సహజ రసాయన చర్యలకు గురిచేశారు. అప్పుడు కార్బన్‌డైఆక్సైడ్‌ ఘనరూపం సంతరించుకుంది. అయితే ఈ వాయువు రాయిలా మారటానికి రెండేళ్లు పట్టింది. ఈ రసాయన చర్య మరింత త్వరగా జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవేవో త్వరగా పూర్తయితే విపరీతంగా పెరిగిపోతూ గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతున్న కార్బన్‌డయాక్సైడ్‌ని చక్కగా రాళ్లలా మార్చేసి పుడమిని కాపాడుకోవచ్చు. ఏమంటారూ! 


పాల నాణ్యత సులువుగా..

 

పాల నాణ్యత తెలుసుకోవడం ఎప్పుడూ పెద్ద పనే. ముఖ్యంగా పాశ్చరైజేషన్‌ తర్వాత పాల నాణ్యతని అందులో ఉండే ఆల్కలిన్‌ ఫాస్పటేజ్‌ని బట్టి నిర్ధరిస్తారు. ఈ ఎంజైమ్‌ని కనుగొనాలంటే పెద్ద సరంజామానే అవసరం. దీన్ని మరింత సులభతరం చేసింది ఐఐటీ గువాహటి పరిశోధక బృందం. ఈ ఎంజైమ్‌ మోతాదును తెలిపే పేపర్‌ కిట్‌ సెన్సార్‌ను ఈ బృందం ఆవిష్కరించింది. ఇందులో పాల చుక్క వేయగానే ఆల్కలిన్‌ తగిలిన వెంటనే ఈ కిట్లోని తెల్లని కాగితం రంగు మారుతుంది. మారిన రంగును బట్టి ఆల్కలిన్‌ ఫాస్ఫటేజ్‌ శాతాన్ని గుర్తించి పాల నాణ్యత తెలుసుకోవచ్చు. ఈ కిట్‌ ల్యాబ్‌ పరిశోధనలతో పాటు, ఇంట్లో వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుందట. ఇంకేం.. మార్కెట్‌లోకి రాగానే తీసేసుకుంటే సరి!


మెడి సారథి

కోవిడ్‌-19 బారిన పడకుండా కంటైన్‌మెంట్‌ జోన్లల్లోని ప్రజలకు సేవలందించాలంటే ఎలా? ఛండీగఢ్‌లోని పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి, ఐఐటీ రూపర్‌లు కలిసి దీనికో పరిష్కారాన్ని ఆవిష్కరించాయి. మెడి సారథి, ఆల్‌ పవర్డ్‌ ట్రాలీల పేరిట వీళ్లు రూపొందించిన ఉపకరణాలు ఆరోగ్య కార్యకర్తలు, ఇతర ప్రభుత్వోద్యోగుల పనిని తేలిక చేస్తాయి. కృత్రిమ మేథతో పనిచేసే ‘మెడి సారథి’ డ్రోన్‌ ద్వారా మందులు, ఔషధాలు, ఇతర సామగ్రిని ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించవచ్చు. దీనికి అమర్చిన కెమెరాల ద్వారా మనషుల శరీర ఉష్ణోగ్రతలనూ నమోదు చేయవచ్చు. రిమోట్‌తో పనిచేసే ఈ డ్రోన్‌ ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్‌ పనులకూ అక్కరకొస్తుందట. బాగుంది కదా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు