close


ఇది విన్నారా/ మీకు తెలుసా

అతిరథ మహారథులు

గొప్ప గొప్పవాళ్ళు చాలామంది వచ్చారని చెప్పేటప్పుడు అతిరథ మహారథులందరూ వచ్చారని అంటూంటాం కానీ, ఆ పదాలకు సరైన అర్థం మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి. వాటికి అసలైన అర్థమేమిటో చూద్దాం... యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలుపుతాయివి.

రథి: ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు. సోమదత్తుడు, సుదక్షిణుడు, శకుని, శిశుపాలుడు, ఉత్తరుడు, కౌరవుల్లో 96 మంది, శిఖండి, ఉత్తమౌజులు, ఉప పాండవులు - వీరంతా రథులు.

అతి రథి (రథికి 12 రెట్లు): 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు. లవకుశులు, కృతవర్మ, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, ద్రుపదుడు, యుయుత్సుడు, విరాటుడు, అకంపనుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, ఘటోత్కచుడు, ప్రహస్తుడు, అంగదుడు, దుర్యోధనుడు, జయద్రథుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, విరాటుడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు, ప్రద్యుమ్నుడు - వీరు అతిరథులు.

మహారథి (అతిరథికి 12 రెట్లు): 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగదుడు, అశ్వత్థామ, అతికాయుడు, భీముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రావణుడు, భగదత్తుడు, నరకాసురుడు, లక్ష్మణుడు, బలరాముడు, జరాసంధుడు - వీరంతా మహారథులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.