close


ఫొటోఫీచర్

డ్రాగన్‌ బ్రిడ్జ్‌

అల్లంతదూరాన కనువిందుచేస్తున్న నీలాల నింగి రెండు కొనలనూ కలపడానికే నిర్మించారా అన్నట్లుగా ఉన్న ఈ వంతెన పేరు డ్రాగన్‌ బ్రిడ్జ్‌. అటూ ఇటూ ఆరు వరసల రహదారి మధ్యలో ఉక్కుతో చేసిన భారీ డ్రాగన్‌ ఆకారంతో వియత్నాంలోని హన్‌ నదిమీద ఉన్న ఈ వంతెన పొడవు 2185 అడుగులు. స్టీలుతో నిర్మించిన ఈ భారీ డ్రాగన్‌ ఆకారం నోటి నుంచి పగటివేళ నీళ్లూ రాత్రిపూట మంటలూ వెదజల్లేలా ప్రత్యేక ఏర్పాటుచేశారు. వియత్నాం దేశస్థులు డ్రాగన్‌ని తమ అదృష్ట చిహ్నంగా భావిస్తారట. దానికి ప్రతీకగానే ప్రపంచంలోనే అతి పెద్ద స్టీలు డ్రాగన్‌ వంతెనను నిర్మించడంతోపాటు దీన్ని దగ్గర నుంచీ చూసేందుకు వీలుగా ప్రత్యేక నడకదారులనూ ఏర్పాటుచేశారు.


పదపదవే వయ్యారి గాలిపటమా..!

సంక్రాంతి పండగ అనగానే పల్లెపడుచుల రంగవల్లులు, డూడూ బసవన్నల గానాలూ, హరిదాసు కీర్తనలూ, కొత్త అల్లుళ్ల సందళ్లూ... గుర్తుకువస్తాయి. ఇవన్నీ నేలకు సంక్రాంతి శోభను తీసుకొస్తే, వివిధ రంగుల్లో రకరకాల ఆకారాల్లో పైపైకి ఎగిరే గాలిపటాలు నింగికి ఆ పండగ సంబరాలను అద్దేస్తాయి. అందుకే సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గాలిపటాలను ఎగరేస్తారు. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ గాలిపటాల సంబరాలను అంతర్జాతీయంగానూ నిర్వహిస్తారు. ఏటా జనవరి రెండో వారంలో అహ్మదాబాద్‌లోని సబర్మతీ తీరం ఈ వేడుకకు వేదికవుతోంది. ఇక్కడ వింత వింత ఆకృతుల్లో కనువిందు చేస్తున్న గాలిపటాలు ఆ పండగలోనివే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.