close


రాశిఫలం

రాశిఫలం

గ్రహ బ‌లం (మార్చి17 - మార్చి23)

మేషం  
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
మీరు మనసులో ఏది తలిస్తే అదే విధంగా ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. పనులు పూర్తవ్వాలంటే పట్టుదల చాలా అవసరం. విఘ్నాలను అధిగమిస్తారు. ఇబ్బందికి గురిచేసేవారున్నారు. ఆవేశం పనికిరాదు. వారం మధ్యలో ఒక సమస్య నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది.
వృషభం 
కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు 
శుభయోగాలున్నాయి. అభీష్టాలు త్వరగా నెరవేరతాయి. దగ్గరివారితో సఖ్యత అవసరం. అవరోధాలున్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. గృహంలో శుభం జరుగుతుంది. ప్రమాదాల నుంచి బయటపడతారు. నిందారోపణలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. పదవీలాభం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్ఠం.
మిథునం 
మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
బంధుమిత్రుల వల్ల శుభం జరుగుతుంది. పనిలో సంతృప్తి దొరుకుతుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషంగా కాలం గడుస్తుంది. లాభాలున్నాయి. చేస్తున్న పనిలో పెద్దల సహకారం లభిస్తుంది. వారం మధ్యలో ఒక మంచి జరుగుతుంది. శివారాధన ఉత్తమం.
కర్కాటకం 
పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష 
శుభకాలం నడుస్తోంది. విజయావకాశాలు పెరుగుతాయి. కృషి ఫలిస్తుంది. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మనసులోని ఆలోచనలు కార్యరూపాన్నిదాలుస్తాయి. ఒక సమస్య తొలగుతుంది. శత్రుపీడ మనసుకు ఇబ్బంది కలిగిస్తుంది. మిత్రబలంతో ప్రశాంతత లభిస్తుంది. అధికారుల అండ లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.
సింహం 
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
విజయం లభిస్తుంది. లక్ష్యాన్ని చేరతారు. అనేక మార్గాల్లో అవరోధాలున్నాయి, చాకచక్యంగా వ్యవహరించాలి.  పనుల్లో శ్రద్ధ లోపించకుండా చూసుకోండి. త్వరలోనే మంచికాలం వస్తుంది. ముందస్తు ప్రణాళికలతో సమస్యల నుంచి బయటపడతారు. మంచి జరుగుతుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. విష్ణుస్మరణ రక్షిస్తుంది.
కన్య 
ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు 
రాజయోగాలున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. శాంతచిత్తంతో ముందుకు సాగండి. సహకారం అందుతుంది. ధనలాభముంది. మంచి జరుగుతుంది. దగ్గరివారితో గొడవలు రానీయకండి. కొందరికి మేలు చేస్తారు. అపోహలు తొలగుతాయి. వాహన యోగముంది. లలితాదేవిని స్మరించండి.
తుల 
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
అదృష్టకాలం కొనసాగుతోంది. ఎటుచూసినా విజయమే గోచరిస్తుంది. దైవానుగ్రహంతో ఒక మేలు జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. అంచలంచెలుగా ఎదుగుతారు. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. సంతృప్తినిచ్చే ఫలితం ఒకటుంది. ఆర్థిక పరిపుష్టి ఉంది. ఖర్చులు కూడా ఉంటాయి. అపార్థాలకు తావివ్వకండి. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది.
వృశ్చికం   
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ 
శక్తివంచన లేకుండా పనిచేయండి. అదృష్టవంతులవుతారు. ఉన్నత స్థితి లభిస్తుంది. బుద్ధిబలంతో లాభాలు ఆర్జిస్తారు. సహనంతో పనిచేసి ప్రశంసలందుకుంటారు. అడ్డుతగిలే వారున్నారు. సత్యనిష్ఠతో ముందుకు సాగితే ఇబ్బందులుండవు. అధికారులు ప్రసన్నులవుతారు. ఆనందించే అంశాలున్నాయి. వేంకటేశ్వరస్వామిని ధ్యానించండి.
ధనుస్సు   
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. పనుల్లో పొరపాటు జరగనీయకండి. చక్కని విజయం లభిస్తుంది. కొన్ని ఇబ్బందులున్నాయి. ఎవరి మాటలనూ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అధిక ఖర్చు ఉంటుంది. న్యాయపరమైన అంశాల్లో పురోగతి లభిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
మకరం   
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
అదృష్టయోగముంది. శీఘ్ర కార్యసిద్ధి. కల సాకారమవుతుంది. అన్నివిధాలా రాణిస్తారు. పదిమందికీ సహకారాన్ని అందిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది. చక్కని ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి బంగారు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు. ధర్మం రక్షిస్తుంది. ఇష్టదేవతా దర్శనం ఆనందాన్నిస్తుంది.
కుంభం   
ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి. అర్థలాభముంది. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. మిత్రులతో విభేదించవద్దు. వారి సూచనలు పాటిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. ఇబ్బందుల నుంచి క్రమంగా బయటపడతారు. గణపతి ఆరాధన కార్యసిద్ధినిస్తుంది.
మీనం   
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
దైవానుగ్రహంతో విజయం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. మాటపట్టింపులకు పోవద్దు. లక్ష్మీకటాక్షసిద్ధి ఉంది. కొందరు విఘ్నాలను కలిగిస్తారు. మీ ఆలోచనా విధానంతో వాటిని అధిగమిస్తారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. వారం మధ్యలో ఒక శుభం జరుగుతుంది. స్థిరత్వం వస్తుంది. సరస్వతీ ధ్యానం జ్ఞానాన్నిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.