close

మర్మ దేశం

ఇదో ‘దొంగ’ సిద్ధాంతం!

  • జ్వరం వచ్చింది. డాక్టర్‌ దగ్గరకెళ్లారు. ఆయన ప్రాథమికంగా పరీక్షించి కొన్ని మందులిస్తారు. అప్పటికీ జ్వరం తగ్గకపోతే టెస్టులు చేయిస్తారు. ఆ టెస్టులు కూడా ముందు మలేరియా, టైఫాయిడ్‌, కామెర్లులాంటివి ఉన్నాయేమో చూస్తారు. అక్కడా తేలకపోతేనే ఇంకాస్త పెద్ద పరీక్షలు- అంటే సీబీపీలాంటివి చేస్తారు. నిజానికి, జ్వరానికి మలేరియానే కాదు క్యాన్సర్‌ కూడా కారణమై ఉండొచ్చు. కానీ, ముందుగానే క్యాన్సర్‌ అని ఎందుకు అనుమానించరు? మలేరియా, టైఫాయిడ్‌ వంటి చిన్న పరీక్షలతోనే ఎందుకు ప్రారంభిస్తారు?

  • ఎందుకంటే, వైద్యశాస్త్రం అలాగే చేయాలని చెబుతుంది కాబట్టి. ముందు, ఓ రోగికి వచ్చేందుకు ఎక్కువ అవకాశమున్న వ్యాధులకి సంబంధించిన పరీక్షలే చేయాలికానీ... తక్కువ ఛాన్స్‌ ఉన్న వాటికి సంబంధించినవి చేయకూడదన్నది నియమం. అలా చేయడం వల్ల చికిత్స పక్కదారిపట్టకుండా ఉంటుందన్నది నమ్మకం. దీన్నే ‘సటన్స్‌ లా’ అని అంటారు. ఇంతకీ ఈ ‘సటన్స్‌ లా’కి కారణమైన సటన్‌ వైద్యశాస్త్ర నిష్ణాతుడేమీ కాదు... అతనో దొంగ! 1940 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికాలో ఎన్నో బ్యాంకు దోపిడీలు చేశాడు. అతనోసారి దొరికిపోయినప్పుడు ఓ జర్నలిస్టు నువ్వెందుకిలా బ్యాంకుల్లో దోపిడీలు చేస్తున్నావని అడిగాడట. అందుకు సటన్‌ ‘ఎందుకంటే డబ్బుండేది బ్యాంకుల్లోనే కాబట్టి..!’ అని జవాబిచ్చాడు. అప్పట్లో ఆ వాక్యం పత్రికల్లో చాలా పాపులరైపోయింది. దాన్ని అటూఇటూ మార్చి వివిధ సందర్భాల్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. చిత్రంగా ఆ వాడకం వైద్యశాస్త్రంలో కూడా ప్రవేశించింది. ‘వ్యాధికి కారణాలని సూచించే చిన్నపరీక్షలతోనే చికిత్స మొదలుపెట్టాలి... ఎందుకంటే, చాలా రోగాలు వాటిలోనే తేలిపోతాయి కాబట్టి!’ అనే భావంతో ఈ సటన్స్‌లాని వాడుతున్నారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.