Array
(
  [0] => Array
    (
      [0] => stdClass Object
        (
          [magzine_id] => 13084
          [magzine_cat_id] => 9
          [magzine_title] => అప్పుడు... నిజంగానే ఏడ్చేశా!

          [magzine_feature_image] => 
          [magzine_thumb_image] => eeimages/sundaymagzine/thumb_images/1568488702.jpg
          [magzine_short_description] => ‘ముకుంద’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి తన నటనతో ‘ఫిదా’ చేశాడు వరుణ్‌తేజ్‌. లవర్‌బాయ్‌లా... పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ యువతరం నటుడు ‘వాల్మీకి’లో సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ప్రయోగమంటే ఎప్పుడూ ముందుండే వరుణ్‌ తన జీవితంలోని కొన్ని అనుభవాలు ఇలా పంచుకున్నాడు.

          [magzine_long_description] => 

‘ముకుంద’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి తన నటనతో ‘ఫిదా’ చేశాడు వరుణ్‌తేజ్‌. లవర్‌బాయ్‌లా... పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ యువతరం నటుడు ‘వాల్మీకి’లో సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ప్రయోగమంటే ఎప్పుడూ ముందుండే వరుణ్‌ తన జీవితంలోని కొన్ని అనుభవాలు ఇలా పంచుకున్నాడు.

తొలిప్రేమ

స్కూల్లో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ విషయాన్ని తనకెప్పుడూ చెప్పలేదు. కొన్నిరోజుల తరవాత స్లామ్‌ బుక్‌ వాడి తన ఫోన్‌ నంబర్‌ సంపాదించా. ఒకటి రెండుసార్లు ఫోన్‌ చేసి ఫ్రెండ్లీగా మాట్లాడా. ఒకసారి సినిమాకి రమ్మని పిలిస్తే వచ్చింది. థియేటర్‌లో పక్క పక్కనే కూర్చున్నాం కానీ ఏం మాట్లాడుకోలేదు. పుట్టినరోజుకి చాక్లెట్లు బహుమతిగా ఇస్తే నవ్వుతూ తీసుకుంది గానీ మనసులో ఏముందో తెలియదు. తను చదువులో టాపర్‌. స్కూల్‌ చదువు అయ్యాక విదేశాలకు వెళ్లిపోయింది. ఆ తరవాత నేను తన గురించి ఆలోచించిందిలేదు. అది జస్ట్‌ ఇన్‌ఫ్యాట్చ్యుయేషన్‌ అని అప్పుడే అర్థమైంది.

స్ఫూర్తినిచ్చింది...

‘ఇంద్ర’ 75రోజుల వేడుకకి పెదనాన్నతో కలిసి వెళ్లా. ఆ వేదికపైన నిలబడితే కనుచూపు మేరలో ఎటు చూసినా అభిమానులే. చివరి వరసలో నిల్చున్నవాళ్లకి వేదికా, దానిపైన మనుషులూ సరిగా కనిపించరు కూడా. అలాంటిది పెదనాన్న కోసం గంటల తరబడి నిల్చుని చూసిన వాళ్ల అభిమానానికి నేను ఫిదా అయ్యా. హీరో అయితే అలాంటి ప్రేమని పొందొచ్చు అనిపించి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా.

తొలి దర్శకుడు

హీరోనవుతానని ఇంట్లో చెబితే ‘ముందు చదువు పూర్తి చెయ్‌...’ అన్నారు. దాంతో ఎంబీఏ చదవాలనుకున్న నేను డిగ్రీతోనే సరిపెట్టేశా. ఆ తరవాత కల్యాణ్‌ బాబాయ్‌ ‘నటుడిగా రాణించాలంటే మెలకువలు తెలిసుండాలి’ అని చెప్పారు. తాను శిక్షణ తీసుకున్న సత్యానంద్‌గారి ఇన్‌స్టిట్యూట్‌లోనే నన్నూ చేర్పించారు. యాక్టింగ్‌ కోర్సు చివర్లో ఉన్నప్పుడు శ్రీకాంత్‌ అడ్డాల నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ‘ముకుంద’లో అవకాశమిచ్చారు. ఆ సమయంలో ‘సీతమ్మవాకిట్లో...’ తీస్తున్నారు. అది పూర్తికాగానే ‘ముకుంద’ మొదలుపెట్టాలని ముందే నన్ను ఎంపిక చేసుకున్నారు.

కష్టపడింది...

నేను సినిమాల్లోకి రాకముందు 125 కేజీల బరువు ఉండేవాణ్ని. ‘ముకుంద’ ఒప్పుకున్నాక బరువు తగ్గడం బెటర్‌ అనిపించింది. ఆర్నెల్లు కష్టపడి 35 కిలోలు తగ్గా. అందుకోసం చాలా కఠినంగా డైట్‌, వ్యాయామాలు చేశా. బరువు తగ్గడం ఎంత కష్టమో అప్పుడే అర్థమైంది. ఆ సమయంలో మా అమ్మ మాత్రం నేను పూర్తిగా తిండి మానేశాననుకుని తెగ బాధపడిపోయేది. ఇంట్లో ఖాళీగా దొరికితే ఏదో ఒకటి తినిపిస్తుండేది. కడుపునిండా తిని వర్కవుట్‌ చేయమనేది. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ చాలా జాగ్రత్తగా ఉంటూ బరువు పెరగకుండా చూసుకుంటున్నా.

కంటతడి పెట్టింది...

‘లోఫర్‌’లో ‘సువ్వీ... సువ్వాలమ్మా...’ అమ్మ సెంటిమెంట్‌ పాట. ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా అమ్మ ఉంటే చాలు అన్న భావంతో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ పాట షూట్‌ చేసేప్పుడు నాకు నిజంగా ఏడుపొచ్చి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయా. చివరికి పాట కూడా చేయలేకపోయా. దాంతో దర్శకుడు పూరీ నాకోసం ఆరోజు షూటింగ్‌ కూడా క్యాన్సిల్‌ చేశారు. వ్యక్తిగతంగా మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. తను లేకపోతే నాకు ఇంటికి కూడా వెళ్లాలనిపించదు.

ఇబ్బందిపడింది...

కసారి నా స్నేహితులతో కలిసి ఓ ఫంక్షన్‌కి వెళ్లా. అందరం కలిసి మాట్లాడుకుంటుంటే వెనక నుంచి ఒకమ్మాయి  వచ్చి కౌగిలించుకుంది. వెనక్కి తిరిగి చూసే లోపు చెంపపైన ముద్దు పెట్టి వెళ్లిపోయింది. తను అభిమాని అయి ఉంటుంది. దాన్ని అలా ప్రదర్శించి వెళ్లిపోయింది కానీ నాకు అందరి ముందూ ఇబ్బందిగా సిగ్గుగా అనిపించింది.
[magzine_isactive] => 1 [magzine_ipaddress] => 172.17.23.238 [magzine_entryby] => 8927425 [magzine_entrydate] => 2019-09-15 00:48:22.994951 [magzine_modifiedby] => [magzine_modifieddate] => [magzine_date] => 2019-09-15 [magzine_title_html] =>

అప్పుడు... నిజంగానే ఏడ్చేశా!

[magzine_short_description_html] =>

‘ముకుంద’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి తన నటనతో ‘ఫిదా’ చేశాడు వరుణ్‌తేజ్‌. లవర్‌బాయ్‌లా... పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ యువతరం నటుడు ‘వాల్మీకి’లో సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ప్రయోగమంటే ఎప్పుడూ ముందుండే వరుణ్‌ తన జీవితంలోని కొన్ని అనుభవాలు ఇలా పంచుకున్నాడు.

[magzine_tags] => [magzine_homepage_image] => [magzine_isdeleted] => [changeid] => [magzine_cat_name_english] => Movie [magzine_cat_name_telugu] => సినిమా [magzine_cat_isactive] => 1 [magzine_cat_entryby] => admin [magzine_cat_entrydate] => 2017-06-15 16:39:33.812734 [magzine_cat_modifiedby] => [magzine_cat_modifieddate] => [magzine_cat_order] => 9 [catname] => సినిమా ) ) )
అప్పుడు... నిజంగానే ఏడ్చేశా! - Sunday Magazine - EENADU అప్పుడు... నిజంగానే ఏడ్చేశా! - Sunday Magazine
close

సినిమా

అప్పుడు... నిజంగానే ఏడ్చేశా!

‘ముకుంద’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి తన నటనతో ‘ఫిదా’ చేశాడు వరుణ్‌తేజ్‌. లవర్‌బాయ్‌లా... పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ యువతరం నటుడు ‘వాల్మీకి’లో సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ప్రయోగమంటే ఎప్పుడూ ముందుండే వరుణ్‌ తన జీవితంలోని కొన్ని అనుభవాలు ఇలా పంచుకున్నాడు.

తొలిప్రేమ

స్కూల్లో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ విషయాన్ని తనకెప్పుడూ చెప్పలేదు. కొన్నిరోజుల తరవాత స్లామ్‌ బుక్‌ వాడి తన ఫోన్‌ నంబర్‌ సంపాదించా. ఒకటి రెండుసార్లు ఫోన్‌ చేసి ఫ్రెండ్లీగా మాట్లాడా. ఒకసారి సినిమాకి రమ్మని పిలిస్తే వచ్చింది. థియేటర్‌లో పక్క పక్కనే కూర్చున్నాం కానీ ఏం మాట్లాడుకోలేదు. పుట్టినరోజుకి చాక్లెట్లు బహుమతిగా ఇస్తే నవ్వుతూ తీసుకుంది గానీ మనసులో ఏముందో తెలియదు. తను చదువులో టాపర్‌. స్కూల్‌ చదువు అయ్యాక విదేశాలకు వెళ్లిపోయింది. ఆ తరవాత నేను తన గురించి ఆలోచించిందిలేదు. అది జస్ట్‌ ఇన్‌ఫ్యాట్చ్యుయేషన్‌ అని అప్పుడే అర్థమైంది.

స్ఫూర్తినిచ్చింది...

‘ఇంద్ర’ 75రోజుల వేడుకకి పెదనాన్నతో కలిసి వెళ్లా. ఆ వేదికపైన నిలబడితే కనుచూపు మేరలో ఎటు చూసినా అభిమానులే. చివరి వరసలో నిల్చున్నవాళ్లకి వేదికా, దానిపైన మనుషులూ సరిగా కనిపించరు కూడా. అలాంటిది పెదనాన్న కోసం గంటల తరబడి నిల్చుని చూసిన వాళ్ల అభిమానానికి నేను ఫిదా అయ్యా. హీరో అయితే అలాంటి ప్రేమని పొందొచ్చు అనిపించి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా.

తొలి దర్శకుడు

హీరోనవుతానని ఇంట్లో చెబితే ‘ముందు చదువు పూర్తి చెయ్‌...’ అన్నారు. దాంతో ఎంబీఏ చదవాలనుకున్న నేను డిగ్రీతోనే సరిపెట్టేశా. ఆ తరవాత కల్యాణ్‌ బాబాయ్‌ ‘నటుడిగా రాణించాలంటే మెలకువలు తెలిసుండాలి’ అని చెప్పారు. తాను శిక్షణ తీసుకున్న సత్యానంద్‌గారి ఇన్‌స్టిట్యూట్‌లోనే నన్నూ చేర్పించారు. యాక్టింగ్‌ కోర్సు చివర్లో ఉన్నప్పుడు శ్రీకాంత్‌ అడ్డాల నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ‘ముకుంద’లో అవకాశమిచ్చారు. ఆ సమయంలో ‘సీతమ్మవాకిట్లో...’ తీస్తున్నారు. అది పూర్తికాగానే ‘ముకుంద’ మొదలుపెట్టాలని ముందే నన్ను ఎంపిక చేసుకున్నారు.

కష్టపడింది...

నేను సినిమాల్లోకి రాకముందు 125 కేజీల బరువు ఉండేవాణ్ని. ‘ముకుంద’ ఒప్పుకున్నాక బరువు తగ్గడం బెటర్‌ అనిపించింది. ఆర్నెల్లు కష్టపడి 35 కిలోలు తగ్గా. అందుకోసం చాలా కఠినంగా డైట్‌, వ్యాయామాలు చేశా. బరువు తగ్గడం ఎంత కష్టమో అప్పుడే అర్థమైంది. ఆ సమయంలో మా అమ్మ మాత్రం నేను పూర్తిగా తిండి మానేశాననుకుని తెగ బాధపడిపోయేది. ఇంట్లో ఖాళీగా దొరికితే ఏదో ఒకటి తినిపిస్తుండేది. కడుపునిండా తిని వర్కవుట్‌ చేయమనేది. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ చాలా జాగ్రత్తగా ఉంటూ బరువు పెరగకుండా చూసుకుంటున్నా.

కంటతడి పెట్టింది...

‘లోఫర్‌’లో ‘సువ్వీ... సువ్వాలమ్మా...’ అమ్మ సెంటిమెంట్‌ పాట. ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా అమ్మ ఉంటే చాలు అన్న భావంతో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ పాట షూట్‌ చేసేప్పుడు నాకు నిజంగా ఏడుపొచ్చి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయా. చివరికి పాట కూడా చేయలేకపోయా. దాంతో దర్శకుడు పూరీ నాకోసం ఆరోజు షూటింగ్‌ కూడా క్యాన్సిల్‌ చేశారు. వ్యక్తిగతంగా మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. తను లేకపోతే నాకు ఇంటికి కూడా వెళ్లాలనిపించదు.

ఇబ్బందిపడింది...

కసారి నా స్నేహితులతో కలిసి ఓ ఫంక్షన్‌కి వెళ్లా. అందరం కలిసి మాట్లాడుకుంటుంటే వెనక నుంచి ఒకమ్మాయి  వచ్చి కౌగిలించుకుంది. వెనక్కి తిరిగి చూసే లోపు చెంపపైన ముద్దు పెట్టి వెళ్లిపోయింది. తను అభిమాని అయి ఉంటుంది. దాన్ని అలా ప్రదర్శించి వెళ్లిపోయింది కానీ నాకు అందరి ముందూ ఇబ్బందిగా సిగ్గుగా అనిపించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.