
ఇంటర్నెట్ డెస్క్: 2020 సంవత్సరం గురించి ఎవరిని అడిగినా..అమ్మో అంటారు. ఒకటా..రెండా..ఏకంగా ఆరునెలలు ఇంటి నుంచి బయటికి కాలుపెట్టలేని పరిస్థితి. సినిమా సరదా లేదు..షాపింగ్ లేదు..వీకెండ్ పార్టీ ఊసే లేదు. మరోవైపు వలస కూలీల కష్టాలు..ఆకలి కేకలు..సొంత వారి చివరి చూపుకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా కొవిడ్-19 తెచ్చిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. అందుకే 2020 అంటేనే కలలో కూడా బాబోయ్ అంటారు. అయితే ఇప్పుడు 2020 మిగిల్చిన ఈ చేదు జ్ఞాపకాలన్నింటి నుంచి సరదా పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడో ఓ వ్యక్తి.
2020 గేమ్ పేరుతో గతేడాది చోటుచేసుకున్న సంఘటనలన్నింటిని కలిపి ఒక గేమ్ రూపంలో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇది వెబ్ ఆధారిత గేమ్. దీన్ని ఎవరైనా ఉచితంగా ఆడొచ్చు. ఆరు నెలల వ్యవధిలో మాక్స్ గర్కవి అనే డెవలపర్ ఈ గేమ్‌ను రూపొందించారు. ఇందులో ఆస్ట్రేలియా వైల్డ్‌ఫైర్, కొవిడ్-19, స్టాక్ మార్కెట్ నష్టాలు, క్వారంటైన్, టిక్‌టాక్ బ్యాన్, అమెరికా ఎన్నికలు వంటి సంఘటనలు ఇందులో ఉన్నాయి. సూపర్ మారియో గేమ్ తరహాలోనే ఇందులో కూడా గమ్యానికి చేరడానికి అడ్డంకులను అధిగమించాలి. ఆకర్షణీయమైన పిక్సెల్ ఆర్ట్ గ్రాఫిక్స్‌తో, గొప్ప మ్యూజిక్ అనుభూతితో పదినిమిషాల్లో గేమ్ పూర్తి అవుతుంది.
ఇవీ చదవండి..