వందమంది కలసి ‘ప్రైమ్‌’లో సినిమా చూడొచ్చు
close

Updated : 09/12/2020 17:18 IST

వందమంది కలసి ‘ప్రైమ్‌’లో సినిమా చూడొచ్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సినిమా చూడటం ఒక ఆనందం అయితే, స్నేహితులతో కలసి సినిమా చూడటం అంతకుమించిన ఆనందం. సీన్‌ బాగున్నప్పుడు ‘భలే చేశాడురా..’ అంటూ నవ్వుకోవడం, బోర్‌ కొట్టినప్పుడు ‘ఏంటి రా ఇదీ’ అంటూ ఉసూరుమనడం లాంటివి స్నేహితులతో సినిమా చూసినప్పుడు సాధ్యమవుతుంది. ఇలాంటి ఫీలింగ్‌ కలిగించడానికి అమెజాన్‌ ప్రైమ్‌ కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ‘వాచ్‌ పార్టీ’ పేరుతో వచ్చిన ఈ ఫీచర్‌తో స్నేహితులు కలసి ఒకేసారి సినిమా చూడొచ్చు. 

స్నేహితులు కలసి సినిమా చూసుకోవడం కాన్సెప్ట్‌ కొత్తదేమీ కాదు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ‘పార్టీ ఎక్స్‌టెన్షన్‌’ పేరుతో ఇలాంటిదే అందుబాటులో ఉంది. హైక్‌ యాప్‌లోనూ ఇలాంటి ఓ ఆప్షన్‌ ఉంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ తీసుకొచ్చింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లా కాకుండా... ప్రైమ్‌ వెబ్‌సైట్‌లోనే ఈ ఆప్షన్‌ ఉంటుంది. జూమ్‌, గూగుల్‌ మీట్‌ లాంటి యాప్స్‌లో వీడియో కాల్స్‌/కాన్ఫరెన్స్‌ నిర్వహించే తరహాలోనే... అమెజాన్‌ ప్రైమ్‌ ‘వాచ్‌ పార్టీ’ కూడా చేయొచ్చు. 100 మంది వరకు కలసి సినిమా చూడొచ్చు. 

అంటే మీరు హోస్ట్‌గా మారి.. ఓ ఐడీ జనరేట్‌ చేసి స్నేహితులకు ఇవ్వాలి. దాంతో మీ స్నేహితులందరూ సినిమా చూడొచ్చు. వీడియో ప్లేయింగ్‌ కంట్రోల్‌ మొత్తం హోస్ట్‌ చేతుల్లోనే ఉంటుంది. సినిమా/సిరీస్‌ చూస్తున్న సమయంలో మిత్రులతో ఛాట్‌ కూడా చేసుకోవచ్చు. ఆ ఛాట్‌ విండో వాట్సాప్‌/ మెసెంజర్‌ తరహాలో ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పార్టీ ఫీచర్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.  పార్టీ స్టార్ట్‌ చేసేవారు, లింక్‌ అందుకున్నవారు కచ్చితంగా ప్రైమ్‌ మెంబర్‌ అయి ఉండాలి. 

వాచ్‌ పార్టీ ఎలా యాక్సెస్‌ చేయాలంటే?

డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌లో ఐడీతో అమెజాన్‌ ప్రైమ్‌లో లాగిన్‌ అవ్వండి.

• మీరు కావాల్సిన సినిమా, టీవీ షో, వెబ్‌ సిరీస్‌ను సెర్చ్‌ చేయండి. 

• రిజల్ట్స్‌లో మీ నచ్చిన వీడియో థంబ్‌ను క్లిక్‌ చేయండి. 

• ఏ పేరుతో ఛాట్‌ చేయాలని అనుకుంటున్నారు అంటూ ఓ విండో వస్తుంది. 

• అక్కడ మీ పేరు ఎంటర్‌ చేస్తే, ఓ లింక్‌ జనరేట్‌ అవుతుంది. 

• ఆ లింక్‌ను మీ స్నేహితులకు పంపించాక.. మీరు ప్లే చేయొచ్చు. 

• సినిమా చూస్తూనే ఛాట్‌ బాక్స్‌ ద్వారా ముచ్చటించొచ్చు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న