ఐఫోన్‌లో ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
close

Published : 05/11/2020 23:05 IST
ఐఫోన్‌లో ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్లో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా యాపిల్ ఫోన్లకు ఉండే క్రేజ్‌ వేరు. ధర ఎక్కువైనా వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తుంటాం. అలానే యూజర్స్‌ ఆకట్టుకునేందుకు యాపిల్ ప్రతి ఏడాది ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ విడుదల చేస్తుంటుంది. ఇటీవలే ఐఫోన్ 12ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. త్వరలోనే మరో ఆకర్షణీయమైన ఫీచర్‌ను యాపిల్ తన తర్వాతి తరం ఫోన్లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని సంబంధించిన పేటెంట్ హక్కులను ఇప్పటికే యాపిల్ సొంతం చేసుకుంది. ఇన్‌ఫ్రారెడ్‌ లైట్ టెక్నాలజీతో పనిచేసే ఆప్టికల్ ఇమేజ్‌ సెన్సర్‌ టచ్‌ ఐడీను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ డిస్‌ప్లే కింది భాగంలో దీన్ని అమర్చనుందట. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ తరహాలోనే ఇది పనిచేస్తుందట.

గతంలో యాపిల్ టచ్‌ ఐడీతో ఆధారంగా పనిచేసే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌తో ఫోన్లను తీసుకొచ్చింది. తర్వాత కొంత కాలానికి ఐఫోన్‌ ఎక్స్‌ సిరీస్‌లో ఫేస్ ఐడీ ఫీచర్‌ను పరిచయం చేసింది. తాజాగా ఆప్టికల్ ఇమేజ్‌  సెన్సార్‌ టచ్‌ ఐడీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ ఫీచర్‌ను ఎంత వరకు ప్రొడక్షన్ దశకు తీసుకొస్తుందనే దానిపై టెక్ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకు మొబైల్ కంపెనీలు తాము పేటెంట్ పొందిన టెక్నాలజీని కొన్ని సార్లు ప్రయోగాల దశలో నిలివేస్తాయి. ఒక వేళ యాపిల్ ఈ టెక్నాలజీని వచ్చే ఏడాది తీసుకొచ్చే కొత్త ప్రొడక్ట్స్‌లో పరిచయం చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న