వాట్సాప్‌లో IMP మెసేజ్‌లు మిస్‌ అవుతున్నారా?
close

Updated : 30/12/2020 17:56 IST
వాట్సాప్‌లో IMP మెసేజ్‌లు మిస్‌ అవుతున్నారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ వచ్చిన తొలినాళ్లలో కేవలం ఫ్రెండ్స్‌తో ఛాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడేది. ఇప్పుడంతా వాట్సాప్‌ మయం. ఆఫీసు విషయాలు సైతం ఇందులోనే. దీంతో ఉదయం లేస్తే చాలు.. డేటా ఆన్‌లో ఉంటే మెసేజుల మీద మెసేజులు వస్తూనే ఉంటాయి. సరే ప్రతిసారీ ఏం చూస్తాంలే అని ఊరుకున్న రోజే.. ‘మీ బాస్‌ నీకో మెసేజ్‌ పెట్టాను. ఆ పని పూర్తి చేశావా?’ అని అడుగుతాడు. దానికి ‘చూడలేదు’ అని సమాధానం చెప్పలేక బిక్కమొహం వేయాల్సి వస్తుంది. ఇతర సందర్భాల్లోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. మరి అలాంటి ముఖ్యమైన మెసేజులు మిస్‌ అవ్వకూడదంటే ఈ చిట్కాలు పాటించండి..

* వాట్సాప్‌లో మీకున్న వ్యక్తిగత కాంటాక్టులు/ గ్రూపుల్లో ఏది ముఖ్యం.. ఏది అంత ముఖ్యం కాదో నిర్ణయించుకోండి. అవసరం లేని గ్రూపులను/ వ్యక్తులను మ్యూట్‌లో పెట్టండి. దీంతో ముందు మీ ఫోన్‌ రోజంతా మోగకుండా ఉంటుంది.

* అలాగే మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎవరు ముఖ్యమో నిర్ణయించుకోండి. అందులో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు/ గ్రూపులకు ప్రత్యేక నోటిఫికేషన్‌/ రింగ్‌టోన్‌ పెట్టుకోండి. అప్పుడు వారు మెసేజ్‌/ కాల్‌ చేయగానే తెలుస్తుంది. అలాగే మరీ అత్యంత ముఖ్యమైన కాంటాక్టుకు వైబ్రేషన్‌ పెట్టుకోవడం మరిచిపోకండి. ఒకవేళ మీ ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా వైబ్రేషన్‌ ద్వారా తెలుస్తుంది. నోటిఫికేషన్‌ సెట్టింగులో ఉన్న లైట్‌ ఆప్షన్‌ కూడా ఉపయోగించుకోవచ్చు.

* మీ బాస్‌ ఏదైనా మెసేజ్‌ పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌లో హై ప్రయారిటీ నోటిఫికేషన్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోండి. దీనివల్ల ఎవరైనా మెసేజ్‌ పెట్టగానే టాప్‌ స్క్రీన్‌లో ప్రివ్యూ కనిపిస్తుంది. అవసరం లేని కాంటాక్టులకు ఈ ఫీచర్‌ను తొలగించండి. ఈ సెట్టింగ్‌ కోసం వాట్సాప్‌లోని నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌లో ‘యూజ్‌ హై ప్రయారిటీ నోటిఫికేషన్‌’ ఆప్షన్‌ను ఉపయోగించండి.

ఇవీ చదవండి..
వాట్సాప్‌లో ఈ ట్రిక్స్‌ గురించి తెలుసా..?
వాట్సాప్‌ అప్‌డేట్‌: ప్రతి ఛాట్‌కి కొత్త వాల్‌పేపర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న