Published : 10/10/2020 21:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గూగుల్‌ కొత్త ఫీచర్‌: శబ్దం వస్తే అలర్ట్‌ చేసేస్తుంది

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు నోటిఫికేషన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హడావుడిలో బయటకు వెళ్తూ నీటి కుళాయిని కట్టేయడం మర్చిపోతుంటాం.. తలుపు తీయకపోతే అదేపనిగా డోర్‌బెల్‌ను మోగించే వారూ ఉంటారు.. ఎవరైనా కొత్త వాళ్లు ఇంటికి వస్తే పెంపుడు కుక్క అరుస్తూనే ఉంటుంది.. ఇలాంటి వాటిని వెంటనే తెలుసుకోవడానికి గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కసారి ఆ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఆన్‌ చేసుకుంటే చాలు ఎక్కడ ఉన్నా సరే ఆ శబ్దాలు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా అలెర్ట్‌ నోటిఫికేషన్స్‌ వచ్చేస్తాయి. గూగుల్‌ లైవ్‌ ట్రాన్స్‌స్క్రైబ్‌ టెక్నాలజీ సాయంతో మాటలను టెక్ట్స్‌ రూపంలో మార్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు చుట్టుపక్కల శబ్దాలను గుర్తించి నోటిఫికేషన్‌ రూపంలో అలెర్ట్‌ చేసేందుకు ఉపకరిస్తుందని గూగుల్‌ చెబుతోంది. 

ప్రధానంగా ఈ ఫీచర్‌ను వినికిడి లోపం ఉన్నవారి కోసం ఉద్దేశించి రూపొందించినట్లు గూగుల్‌ పేర్కొంది. హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని సంగీతం వింటుంటే ఇలాంటి సంఘటనలకు జరిగినప్పుడు యూజర్లను హెచ్చరిస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లతోపాటు ఓఎస్‌ వాచ్‌లకు అలెర్ట్స్‌ నోటిఫికేషన్లు వస్తాయి. ఆన్‌ డివైస్‌ మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా ఆఫ్‌లైన్‌లో ఫీచర్‌ పనిచేస్తుందని గూగుల్‌ తెలిపింది. చిన్న పిల్లల అరుపులు, నీరు పోవడం, పొగ, ఫైర్‌  అలారమ్స్‌, డోరు చప్పుళ్లు వంటి పది రకాల శబ్దాలను గుర్తించి అలెర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 5.0 వెర్షన్‌ నుంచి కొత్తగా వచ్చిన వెర్షన్‌ వరకు అన్ని ఫోన్లలోనూ ఫీచర్‌ పని చేస్తుంది. అయితే గూగుల్‌ మాత్రమే కాకుండా యాపిల్‌ సంస్థ ఇదివరకే ఐఓఎస్‌ 14లో ఇలాంటి శబ్దాలను గుర్తించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు