Published : 16/10/2020 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కూని రాగం గుర్తుపట్టి.. పాటను వెతికిపెట్టి

ఇంటర్నెట్‌డెస్క్‌: మీరు ఒక పాట ట్యూన్‌ని హమ్ చేస్తున్నారు. కానీ ఎంతకీ ఆ పాట పల్లవి మీకు గుర్తుకురావడం లేదు. గుర్తొస్తే పూర్తి పాట యూట్యూబ్‌లో చూద్దాం అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు గూగుల్‌ అసిస్టెంట్‌ మీకు సాయం చేస్తుంది. గూగుల్‌ కొత్తగా తీసుకొచ్చిన హమ్‌ టు సెర్చ్‌ (Hum to Search) ఫీచర్ మీకు సహాయపడుతుంది. మీరు హమ్‌ చేస్తున్న ట్యూన్‌ను గూగుల్‌ సెర్చ్‌లో మైక్‌ ఆన్‌చేసి వినిపిప్తే ఆ పాటను సెర్చ్‌ చేసి మీకు రిజల్ట్స్‌ చూపిస్తుంది. ఒక వేళ ట్యూన్‌ సరిగా అర్థం కాకపోయినా దానికి దగ్గరగా ఉన్న పాటల జాబితాను మన ముందు ఉంచుతుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే ముందుగా గూగుల్ యాప్‌లోకి వెళ్లి మైక్‌ సింబల్‌పై క్లిక్‌ చేసి  వాట్స్‌ ది సాంగ్ (What's The Song) అని అడగాలి. తర్వాత సెర్చ్‌ ఏ సాంగ్‌ ఫీచర్‌ ఆన్‌ అయి లిజనింగ్ అని కనిపిస్తుంది. అప్పుడు మీరు ట్యూన్‌ను వినిపిస్తే పాటను మీకు సెర్చ్‌ రిజల్ట్‌లో చూపిస్తుంది. ఆ పాట వినేందుకు దానిపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. మెషీన్‌ లెర్నింగ్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. కేవలం హమ్మింగ్‌తో మాత్రమే కాకుండా విజిల్, వాయిద్య పరికరాల ద్వారా ట్యూన్‌ వినిపించినా సెర్చ్‌ రిజల్ట్‌ వచ్చేలా ఈ ఫీచర్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు గూగుల్‌ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, గూగుల్‌ అసిస్టెంట్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే ఐఓఎస్‌లో కేవలం ఇంగ్లీష్‌ భాషను మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో 20కి పైగా భాషలను సపోర్ట్ చేస్తుంది. ఓకే గూగుల్‌ అని చెప్పి.. వాయిస్‌ అసిస్టెంట్‌ని యాక్టివ్‌ చేసుకొని కూడా హమ్‌ టు సెర్చ్‌ ఫీచర్‌ను వాడొచ్చు.


మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు