4జీ టెక్నాలజీతో నోకియా ఫీచర్ ఫోన్
close

Published : 06/09/2020 23:02 IST

4జీ టెక్నాలజీతో నోకియా ఫీచర్ ఫోన్

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్ డెస్క్‌: మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు బడ్జెట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇప్పటికీ మనలో చాలా మందికి కీపాడ్ ఉన్న ఫీచర్‌ పోన్లు అంటే ఎంతో ఆసక్తి. స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్లు ఉండవని ఎక్కువ మంది వాటి కొనుగోలుపై ఆసక్తి చూపరు. తాజాగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ అత్యంత తక్కువ ధరలో 4జీ ఫీచర్‌తో కొత్త నోకియా ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానుంది. ఈ మేరకు ఆ ఫోన్‌ వివరాలను టీఈఎన్‌ఏఏ సర్టిఫికేషన్‌ సైట్‌లో ఉంచారు. టీఏ-1212 మోడల్‌ నంబర్‌తో ఈ ఫోన్‌ను నోకియా ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్ ఫోన్ల సిరీస్‌లో తీసుకురానున్నారు.

ఈ ఫోన్‌కు 2.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 1జీహెజడ్‌ సింగిల్ కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనిలో 4జీ ఫీచర్‌ కూడా ఉంది. వెనకవైపున వీజీఏ కెమెరా ఇస్తున్నారు. 1,200ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 64ఎంబీ ర్యామ్‌, 128ఎంబీ అంతర్గత మెమరీ వేరియంట్‌లో దీనిని తీసుకొస్తున్నారు. బ్లూటూత్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. బ్లాక్‌, టర్కోయిస్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది. ఇవే కాకుండా హెచ్‌ఎండీ  గ్లోబల్‌ కంపెనీ 4జీ ఫీచర్‌తో మరిన్ని నోకియా ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీటిలో యూట్యూబ్, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, గూగుల్‌ అసిస్టెంట్ బటన్‌ వంటి ఫీచర్స్‌తో వీటిని తయారు చేస్తున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న