Pollution Absorb Fabric: కాలుష్యాన్ని పీల్చుకునే వస్త్రం
close

Updated : 02/09/2021 19:43 IST
Pollution Absorb Fabric: కాలుష్యాన్ని పీల్చుకునే వస్త్రం

దో నూలు వస్త్రం. కానీ మామూలుది కాదు. చుట్టుపక్కల గాల్లోని బెంజీన్‌, అనిలైన్‌, స్టైరేన్‌ వంటి కాలుష్య కారకాలను పీల్చుకుంటుంది. జిఫ్‌(జియోలైట్‌ ఇమిడాజోలేట్‌ ఫ్రేమ్‌వర్క్‌)-8, జిఫ్‌-67 అనే మార్పు చేసిన నూలుతో దీన్ని రూపొందించారు మరి. కార్బోగ్జైమెథీలేటెడ్‌ నూలు వస్త్రం మీద జిఫ్‌ నానోక్రిస్టల్స్‌ను వృద్ధి చేసి దీన్ని సాధించారు.  ఇంతకీ దీన్ని సృష్టించిందెవరో తెలుసా? ఐఐటీ దిల్లీ పరిశోధకులు. నుసి, నైట్రస్‌ ఆక్సైడ్లు, సల్ఫర్‌ ఆక్సైడ్ల వంటివి పెరగటంతో వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. వీటికి దీర్ఘకాలం పీల్చితే ఆస్థమా వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. ఈ నేపథ్యంలో కొత్తరకం వస్త్రాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని దుస్తులకు, ఆవాసాల్లో వాయు కాలుష్య నియంత్రణకు ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. సోఫాలు, కుర్చీల కవర్లుగానూ వినియోగించుకోవచ్చు. ఇది ఉతికినా చెడిపోదు. 120 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వేడిలో తిరిగి ఉత్తేజితమవుతుంది కూడా. మళ్లీ మళ్లీ వాడుకున్నా కాలుష్యాన్ని గ్రహించే సామర్థ్యమేమీ తగ్గదు. వస్త్రం బరువును బట్టి గరిష్ఠంగా 19.89 ఎంజీ/గ్రా అనిలైన్‌, 24.88 ఎంజీ/గ్రా బెంజీన్‌, 11.16 ఎంజీ/గ్రా స్టెరైన్‌ను గ్రహించుకుంటున్నట్టు ప్రయోగాల్లో బయటపడింది..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న