వాట్సాప్‌ పేమెంట్స్‌ ఎలా చేయాలంటే..
close

Published : 06/11/2020 22:53 IST

వాట్సాప్‌ పేమెంట్స్‌ ఎలా చేయాలంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగదు రహిత లావాదేవీలు, డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) సేవలకు అనుమతిస్తుంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వాట్సాప్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఎన్‌పీసీఐ (ఎన్‌పీసీఐ) అనుమతించింది. దీంతో వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా నగదు చెల్లింపులు చేసేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని 140 బ్యాంకు ఖాతాల ద్వారా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అలానే పది ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. మరి వాట్సాప్‌ ద్వారా పేమెంట్స్‌ ఎలా చేయాలో తెలుసుకుందామా..!

* వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే పేమెంట్స్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే న్యూ పేమెంట్, యాడ్‌ న్యూ పేమెంట్ మెథడ్‌ అని రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి.

* వాటిలో యాడ్ న్యూ పేమెంట్‌ మెథడ్‌పై క్లిక్‌ చేస్తే యాక్సెప్ట్‌ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే మీకు బ్యాంకుల జాబితా కనిపిస్తుంది.

* అందులో మీ ఖాతా ఉన్న బ్యాంక్‌ సెలెక్ట్ చేస్తే ఎస్సెమ్మెస్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేయమని అడుగుతుంది. దాని ఓకే చేసి మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేయాలి. తర్వాత నుంచి మీరు వాట్సాప్‌లో నగదు చెల్లింపులు చెయ్యొచ్చు.

* అలానే మీ బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ అయిన ఫోన్ నంబర్‌, మీ వాట్సాప్‌ అకౌంట్ ఫోన్ నంబర్‌ ఒకటే అయిండాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న