అడ్వాన్స్‌డ్‌ సెల్ఫీ కెమెరాతో మోటో ఫ్లిప్‌ ఫోన్‌
close

Published : 05/10/2020 16:33 IST
అడ్వాన్స్‌డ్‌ సెల్ఫీ కెమెరాతో మోటో ఫ్లిప్‌ ఫోన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మోటోరోలా రేజర్‌ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో వచ్చిన మోటో రేజర్‌ ఫోన్‌కి కొనసాగింపుగా రేజర్‌ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. అల్ట్రా ప్రీమియం డిజైన్‌, అత్యుత్తమ సెల్ఫీ కెమెరా, ఫ్లెక్సిబుల్ డిజైన్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. అలానే ఫోన్ తెరిచినా, మడతబెట్టినా మధ్యలో ఎలాంటి ఖాళీ లేకుండా హింగ్‌ డిజైన్‌ను ఉపయోగించారు. మెటల్‌, గ్లాస్‌తో ఫోన్‌ను తయారుచేశారు. ఈ ఫోన్‌ పూర్తి ఫీచర్స్‌ ఇలా ఉన్నాయి..

మోటో రేజర్‌ 5జీ ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.2 అంగుళాల ప్లాస్టిక్‌ ఓఎల్‌ఈడీ ప్రైమరీ డిస్‌ప్లే ఇస్తున్నారు. అలానే ఫోన్ మడతబెట్టినప్పుడు నోటిఫికేషన్స్‌, మెసేజ్‌లు చూసేందుకు, సెల్ఫీల కోసం  2.7 అంగుళాల క్విక్‌ వ్యూ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 765జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి. ఫోన్‌ మడతబెట్టినప్పుడు క్విక్‌ వ్యూ కింది భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌ కెమెరా ఇస్తున్నారు. ఇందులో లేజర్‌ ఆటోఫోకస్‌ టెక్నాలజీతో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ఫీచర్‌ ఉంది. ఈ కెమెరాతో ఫోన్‌ మడతబెట్టినప్పుడు కూడా సెల్ఫీలు తీసుకోవచ్చు. 20 మెగాపిక్సెల్‌తో రెండో కెమెరాను ఫోన్‌ తెరిచినప్పుడు డిస్‌ప్లే పై భాగంలో అమర్చారు. 2,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ టర్బోఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

అలానే ఈ ఫోన్‌లోని ఫ్లిప్‌ (ఫోన్‌ తెరవడం, మడతబెట్టడం) మెకానిజం రెండు లక్షల ఫ్లిప్‌ల వరకు ధృడంగా ఉంటుందని మోటోరోలా తెలిపింది. శాంసంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 2 తెరిచేందుకు రెండు చేతులు ఉపయోగించాల్సి ఉంటుందని, కానీ మోటో రేజర్‌ 5జీని ఒక్క చేతితోనే ఆపరేట్ చేయ్యెచ్చని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌/256జీబీ ఇంటర్నల్‌ మెమరీ వేరియంట్‌లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 1,24,999గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో అక్టోబరు 12 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. పాలిష్‌ గ్రాఫైట్ రంగులో రేజర్‌ 5జీ లభించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న