అక్టోబర్‌ 1న ‘వన్‌ప్లస్‌ వరల్డ్‌’ వచ్చేస్తోంది..!
close

Updated : 07/10/2020 10:57 IST

అక్టోబర్‌ 1న ‘వన్‌ప్లస్‌ వరల్డ్‌’ వచ్చేస్తోంది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ మధ్య కాలంలో వన్‌ప్లస్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్ల విపణిలోకి తరచుగా మోడల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అలాగే అక్టోబర్‌ 14న వన్‌ప్లస్‌ 8T స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అయితే దానికి ముందే వినియోగదారుల కోసం ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వర్చువల్‌ స్పేస్‌ ‘వన్‌ప్లస్‌ వరల్డ్‌’ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ట్విటర్‌ వేదికగా వన్‌ప్లస్‌విడుదల చేసింది. అయితే అక్టోబర్‌ 1న విడుదల కాబోయే వన్‌ప్లస్‌ వరల్డ్‌కు సంబంధించి టీజర్‌లో ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. వర్చువల్‌ రియాలిటీ సాంకేతికత వన్‌ప్లస్‌కు కొత్తేమీ కాదు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వన్‌ప్లస్‌ నార్డ్‌ ఫోన్‌ను అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌) యాప్‌తో విడుదల చేసింది. వన్‌ప్లస్‌ వరల్డ్ సాయంతో వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే సేవలు పొందే అవకాశం ఉండొచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

అక్టోబర్‌ 14న విడుదల కాబోయే వన్‌ప్లస్‌ 8T ఫోన్‌కు సంబంధించి ఫీచర్స్‌ అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్‌ ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్)‌తో పనిచేస్తుందట. ‌పంచ్ హోల్‌‌ కటౌట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్‌ /128 జీబీ ఇంటర్నెట్‌ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాను అమర్చినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న