ఒప్పో నుంచి స్లైడ్ ఫోన్‌!
close

Published : 19/12/2020 10:59 IST
ఒప్పో నుంచి స్లైడ్ ఫోన్‌!

కొత్త సాంకేతికతను పరిచయం చేసిన చైనా సంస్థ

దిల్లీ: ఫోన్ల తయారీ సంస్థలు వినియోదారులను ఆకట్టుకోవడానికి తమ సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఒకవైపు శామ్‌సంగ్ వంటి సంస్థలు మడతపెట్టే ఫోన్లపై దృష్టి సారించగా, ఇప్పుడు చైనా సంస్థ ఒప్పో స్లైడ్ ఫోన్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. జపాన్‌కు చెందిన నెండో సంస్థతో కలిసి చైనా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డిజైన్ ఎక్స్‌పోలో ఈ కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. ఆ ఫోన్‌కు సంబంధించి ఒప్పో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. 

ఈ స్లైడ్ ఫోన్ చూడటానికి మూడు మడతల తెరతో ఉండి, పొడువుగా కనిపిస్తోంది. ఒక్కో స్క్రీన్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి స్మార్ట్‌ఫోన్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. మొదటి స్క్రీన్‌ను స్లైడ్ చేస్తే..క్లాక్‌, నోటిఫికేషన్లు దర్శనమిస్తాయి. రెండో స్క్రీన్‌ను స్లైడ్ చేయగా..ట్రిపుల్ కెమెరా సెటప్‌, చివరిదాంట్లో..గేమింగ్‌, వీడియోలు చూసేందుకు వీలుగా పూర్తి స్క్రీన్ కనిపిస్తుంది. అక్కడే నోట్స్ రాసుకునే సౌలభ్యం కూడా ఉంది. అలాగే ఈ ఫోన్‌ను సగానికి కూడా మడతపెట్టొచ్చు. అలాగే ఫోన్‌కి ఒక పక్కగా మ్యూట్, షట్టర్ వంటి అనేక బటన్లు అందుబాటులో ఉన్నాయి.  సాధారణ ఛార్జింగ్ తోపాటు దీనికి వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుందని ఒప్పో ఈ వీడియోలో వెల్లడించింది. 

అయితే ఇతర మడత పెట్టే ఫోన్లలో మాదిరిగా స్క్రీన్‌పై కనిపించే మడతల గురించి మాత్రం ఆ వీడియోలో స్పష్టత లేదు. అలాగే ఫోన్‌ లభించే రంగు గురించి కూడా. అయితే వినియోగదారులు మెచ్చేట్లుగా, సౌకర్యవంతంగానే ఫోన్‌ను రూపొందించినట్లు మాత్రం తెలుస్తోంది. ఇక, ఈ ఫోన్‌తో పాటు వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌, స్మార్ట్ వాచ్, ఏఐ స్పీకర్, పోర్టబుల్ ఛార్జర్‌లలో కూడా కొత్త సాంకేతికతను ఆవిష్కరించింది ఈ చైనీస్ సంస్థ. 

ఇవీ చదవండి:

‘ఏక్‌దమ్’గా బిర్యానీ మార్కెట్లోకి డోమినోస్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న