5K బ్యాటరీ..12K ధరలో రియల్‌మీ 7ఐ
close

Updated : 07/10/2020 22:20 IST
5K బ్యాటరీ..12K ధరలో రియల్‌మీ 7ఐ

ఇంటర్నెట్‌డెస్క్‌: రియల్‌మీ మిండ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ 7ఐ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లో క్వాడ్ రియర్‌ కెమెరా, హై రిఫ్రెష్‌ రేట్ స్క్రీన్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మీ 7, 7 ప్రో మోడల్స్‌కి కొనసాగింపుగా 7ఐ తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 64 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ కెమెరాలు రెండు ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ మెమరీ వేరియంట్‌ ధర రూ. 11,999గాను 4జీబీ ర్యామ్‌/128జీబీ ధర రూ. 12,999గా కంపెనీ నిర్ణయించింది. అక్టోబరు 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఫ్యూజన్‌ గ్రీన్‌, ఫ్యూజన్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న