గేమర్స్‌ కోసం రియల్‌మీ కొత్త ఫోన్లు
close

Published : 15/09/2020 11:03 IST
గేమర్స్‌ కోసం రియల్‌మీ కొత్త ఫోన్లు

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా కారణంగా అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ తమ కొత్త మోడల్స్‌ విడుదలను వాయిదా వేశాయి. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడి షాపులు తెరుచుకోవడం, ఆన్‌లైన్‌ అమ్మకాలు జోరందుకోవడంతో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే రెండు బడ్జెట్, మిడ్‌ రేంజ్‌ ఫోన్ల లాంచ్‌ చేసి జోరుమీదున్న రియల్‌మీ సెప్టెంబరు 21న మరో మూడు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. రియల్‌మీ నార్జో 20, నార్జో 20 ప్రో, నార్జో 20ఏ పేర్లతో వీటిని తీసుకురానుంది. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నార్జో 10 సిరీస్‌ ఫోన్లను కొససాగింపుగా వీటిని తీసుకురానుంది.

ఇటీవల విడుదల చేసిన ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0 ఓఎస్‌ను ఈ ఫోన్లలో పరిచయం చేయనున్నారు. ఆకర్షణీయమైన డిజైన్‌తో గేమింగ్‌కు అనూకూలమైన ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించినట్లు సమాచారం. నార్జో 20 మోడల్ 4జీబీ ర్యామ్‌/64జీబీ, 4జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లలో; నార్జో 20ఏ 3జీబీ ర్యామ్‌/32జీబీ, 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గ్లోరీ సిల్వర్‌, విక్టరీ బ్లూ రంగుల్లో లభించనున్నాయని టెక్‌ వర్గాలు తెలిపాయి. ఇక నార్జో 20 ప్రో 6జీబీ ర్యామ్‌/64జీబీతో పాటు 8జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లో లభించనుందట. అయితే వీటి కెమెరా ఫీచర్లు, ధర వంటి ఇతర వివరాలు తెలియాలంటే మాత్రం సెప్టెంబరు 21 వరకు ఆగాల్సిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న