గేమింగ్ ప్రియులకు రియల్‌మీ కొత్త ఫోన్లు
close

Published : 21/09/2020 18:10 IST
గేమింగ్ ప్రియులకు రియల్‌మీ కొత్త ఫోన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్‌లతో జోరుమీదున్న రియల్‌మీ మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ నార్జో 20, నార్జో 20 ప్రో, నార్జో 20ఏ పేర్లతో ఈ మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నార్జో 10 సిరీస్‌ ఫోన్లకు కొనసాగింపుగా ఈ ఫోన్లు వచ్చాయి. 65 వాట్‌ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరాలు, హోల్ పంచ్‌ డిజైన్‌ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్లలో ఉన్నాయి. ఆకర్షణీయమైన డిజైన్‌తో గేమింగ్‌కు అనుకూలమైన ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. ఇవి కాకుండా వీటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం..

రియల్‌మీ నార్జో 20

నార్జో 20 మోడల్‌ ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచడీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.

నార్జో సిరీస్‌లోనే తొలిసారిగా 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 65వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 45 రోజుల స్టాండ్‌బైలో ఉంటుంది. 43 గంటలపాటు ఫోన్ మాట్లాడుకోవచ్చు. అలానే యుట్యూబ్‌లో 18 సినిమాలు చూడొచ్చు, 1200 పాటలు వినోచ్చు. గ్లోరి సిల్వర్‌, విక్టరీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ.10,499గాను, 4జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత మెమరీ ధర రూ. 11,499గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 28 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌, రియల్‌మీ.కామ్‌, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

రియల్‌మీ నార్జ్‌ 20 ప్రో

ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ95 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ప్రాసెసర్‌కు కార్బన్‌ ఫైబర్‌ కూలింగ్ సిస్టంను అమర్చారు. దీని వల్ల ప్రాసెసర్‌ మంచి పనితీరుతో ఎక్కువ కాలం పనిచేస్తుందని రియల్‌మీ తెలపింది. ఈ ఫోన్‌లో ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమరా, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం సోని లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. సైడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఫీచర్‌తోపాటు బ్యాటరీ ఛార్జింగ్ మానిటరింగ్ కోసం 8 సెన్సర్‌లను ఉన్నాయి.

ఇందులో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 65 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కేవలం 38 నిమిషాల్లో వంద శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. వైట్‌ నైట్, బ్లాక్‌ నింజా రంగుల్లో నార్జ్‌ 20 ప్రో లభిస్తుంది.  6జీబీ ర్యామ్‌/64జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ. 14,999గాను, 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి ధర రూ. 16,999గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 25 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌, రియల్‌మీ.కామ్‌, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

రియల్‌మీ నార్జ్‌ 20ఏ

రియల్‌మీ నార్జ్‌ 20ఏ మోడల్‌లో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనక వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా, 2ఎంపీ రెట్రో సెన్సర్‌ కెమెరా, 2ఎంపీ మోనోక్రోమ్ సెన్సర్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 40 రోజుల పాటు స్టాండ్‌బైలో ఉంటుంది. గ్లోరి సిల్వర్‌, విక్టరీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 3జీబీ ర్యామ్‌/ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి వేరియంట్ ధర రూ. 8,499గాను, 4జీబీ ర్యామ్‌/ 64జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ. 9,499గా రియల్‌మీ నిర్ణయించింది. సెప్టెంబరు 30 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌, రియల్‌మీ.కామ్‌, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 

వీటితో పాటు రియల్‌మీ ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0 ఓఎస్‌ను కూడా విడుదల చేసింది. జెడ్‌ జనరేషన్‌ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఈ ఓఎస్‌లో ఎన్నో కొత్త ఫీచర్సను యాడ్‌ చేశారు. రియల్‌మీ షేర్‌, మూడు రకాల డార్క్‌మోడ్స్‌, ఆల్‌వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే (ఏఓడీ) ప్యాట్రన్స్‌, ఫ్లోటింగ్‌ విండో ఫంక్షన్‌, స్లీప్‌ ట్రాకర్‌, స్పీడ్ యాప్‌ లాంచ్‌, యూజర్‌ గోపత్య కోసం ఇన్విజిబుల్ డోర్‌, ప్రైవేట్ స్పేస్‌, సెక్యూరిటీ షీల్డ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మీ ఎక్స్‌50 ప్రో మోడల్‌లో ఈ ఓఎస్‌ను ముందుగా ఇవ్వనున్నారు. ఓపెన్‌ బీటా వెర్షన్‌ను అక్టోబరు చివరి నాటికి, పూర్తి స్థాయి ఓఎస్‌ను నవంబరు చివరికల్లా యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రియల్‌మీ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న