రెడ్‌మీ, రియల్‌మీ నుంచి వచ్చిన ఉత్పత్తులివే..
close

Published : 08/10/2020 10:55 IST
రెడ్‌మీ, రియల్‌మీ నుంచి వచ్చిన ఉత్పత్తులివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా స్మార్ట్‌ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ వినియోగాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. తాజాగా రెడ్‌మీ, రియల్‌మీలు పలు కొత్త మొబైల్‌ యాక్ససరీలతో పాటు స్మార్ట్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిలో ఇయర్‌బడ్స్‌, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌, పవర్‌ బ్యాంక్‌, స్మార్ట్‌ కెమెరా, స్మార్ట్‌ టీవీ, స్పీకర్‌లు ఉన్నాయి. మరి వాటి ఫీచర్స్‌, ధర, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి వంటి వివరాలు మీ కోసం..

రెడ్‌మీ ఇయర్‌బడ్స్‌ 2సీ

ఇందులో డీఎస్‌పీ (డిజిటల్ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌) నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉంది. దీని ద్వారా యూజర్స్‌ అద్భుతమైన కాలింగ్ క్వాలిటీ పొందుతారు. ఇక మ్యూజిక్‌ కంట్రోలింగ్, ఫోన్ కాల్స్‌ ఆపరేటింగ్‌కు కలిపి ఒకే బటన్‌ను ఇస్తున్నారు. ఇందులోని ఐపీఎక్స్‌4 స్వెట్‌, స్ల్పాష్‌ ప్రూఫ్‌ టెక్నాలజీలు నీటిలో తడిసినా పాడవకుండా రక్షణ కల్పిస్తాయి. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తాయి. ప్రతి ఇయర్‌బడ్స్‌లో 43 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఇవి 4 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌లో 300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. దీంతో 12 గంటలపాటు మ్యూజిక్‌ని ఆస్వాదించవచ్చు. నచ్చినట్టుగా సింగిల్‌, డ్యూయల్‌ బడ్స్‌ ఉపయోగించుకునే సదుపాయం ఉంది. ఇయర్‌బడ్స్‌ 2సీ బ్లాక్‌ కలర్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 1499. ప్రారంభ ఆఫర్‌ కింద రూ. 1,299కు అందిస్తున్నారు. అమెజాన్‌, ఎంఐ సైట్లతో పాటు ఎంఐ హోం స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 

రెడ్‌మీ సోనిక్‌బాస్‌ వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌

రెడ్‌మీ నుంచి వస్తున్న తొలి నెక్‌ బ్యాండ్. డ్యూయల్‌ మైక్‌, నాయిస్‌ క్యాన్సిలేషన్‌, హెవీ బేస్ ఫీచర్స్‌తో హై సౌండ్ క్వాలిటీ ఆడియోను యూజర్స్‌ ఆస్వాదించవచ్చు. ఐపీఎక్స్‌ 4, స్ల్పాష్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. 120 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 గంటల పాటు మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, విండోస్‌ డివైజ్‌లతో పాటు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్‌ అలెక్సా, సిరి వంటి వాయిస్‌ బేస్‌ కంట్రోల్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ. 1,299 కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ.999కే అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ సైట్లతో పాటు ఎంఐ హోం స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ ప్రో

యాక్టివ్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌ (ఏఎన్‌సీ) ఫీచర్‌తో రియల్‌మీ అందిస్తున్న తొలి ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో ఇయర్‌బడ్స్‌. 35 డెసిబుల్స్‌ వరకు నాయిస్‌ తగ్గిస్తుంది. అలానే గేమింగ్ ప్రియుల కోసం 94ఎంస్‌ సూపర్‌-లో లేటెన్సీ మోడ్‌ ఇస్తున్నారు. రియల్‌మీ ఎస్‌1 చిప్‌ ఉపయోగించారు. అలానే 10 ఎంఎం బేస్‌ బూస్ట్ డైవర్‌ ఉంది. ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్‌కాల్స్‌ మాట్లాడేందుకు నాయిస్ క్యాన్సిలేషన్‌తో డ్యూయల్‌ మై‌క్రోఫోన్స్‌ ఇస్తున్నారు. 486 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. పూర్తి ఛార్జింగ్‌తో 25 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఏఎన్‌సీతో 20 గంటల పాటు మ్యూజిక్‌ను ఆస్వాదించొచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం పది నిమిషాల ఛార్జింగ్‌తో మూడు గంటల మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. ఐపీఎక్స్‌4 వాటర్‌ రెసిస్టెంట్ ఉంది. బ్లాక్‌, వైట్ రంగుల్లో లభిస్తుంది. అక్టోబరు 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. వీటి ధర రూ. 4,999. పండుగ ఆఫర్‌ కింద రూ. 4,599కే అందిస్తున్నారు.

రియల్‌మీ బడ్స్‌ వైర్‌లెస్‌ ప్రో

రియల్‌మీ నుంచి వస్తున్న రెండో వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ మోడల్‌. 160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 22 గంటలు, ఏఎన్‌సీతో 16 గంటల పాటు పనిచేస్తుంది. 1.5 గంటల్లో బ్యాటరీ వంద శాతం ఛార్జ్‌ అవుతుంది. 5 నిమిషాల ఛార్జింగ్‌తో 100 నిమిషాలు పనిచేస్తుంది. గేమర్స్‌ కోసం 119 ఎంస్‌ సూపర్‌-లో లేటెన్సీ మోడ్‌ ఇస్తున్నారు. 13.6 బేస్‌ బూస్ట్‌ డ్రైవర్‌ ఉంది. రియల్‌మీ ఎస్‌1 చిప్‌ ఉపయోగించారు. 35 డెసిబుల్ యాక్టివ్ నాయిస్‌ కాన్సిలేషన్, మాగ్నటిక్‌ ఇన్‌స్టా కనెక్షన్‌, ట్రాన్సపరెన్సీ మోడ్, ఐపీఎక్స్‌4 వాటర్‌ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. డిస్కో గ్రీన్‌, పార్టీ ఎల్లో కలర్స్‌లో లభిస్తుంది. అక్టోబరు 16 నుంచి అమెజాన్‌, రియల్‌మీ ఆన్‌లైన్‌ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. దీని ధర రూ. 3,999 కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ. 1000 తగ్గింపుతో కేవలం రూ. 2,999కే అందిస్తున్నారు.

వీటితో పాటు రియల్‌మీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ, స్మార్ట్‌ కెమెరా, సౌండ్‌ బార్, స్మార్ట్ ప్లగ్, పవర్‌ బ్యాంక్‌, ఎలక్ట్రానిక్‌ టూత్ బ్రష్ విడుదల చేసింది. రియల్‌మీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ఆండ్రాయిడ్ 9పై ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో 55 అంగుళాల సినిమాటిక్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో క్వాడ్‌కోర్ ‌మీడియాటెక్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇస్తున్నారు. దీని ధర రూ. 42,999. ప్రారంభ ఆఫర్ కింద రూ. 39,999కే విక్రయిస్తున్నారు. అక్టోబరు 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ సైట్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇక రియల్‌మీ 100 వాట్ సౌండ్‌ బార్‌ రూ. 6,999. అక్టోబరు 16 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో 2.25 అంగుళాల 15 వాట్ స్పీకర్స్‌ రెండు, 60 వాట్‌ అవుట్‌పుట్ ఇచ్చే 15 వాట్ ట్వీటర్స్‌ రెండు, 40 వాట్ సబ్‌వూఫర్‌లు ఉన్నాయి.

వైఫై కనెక్టివిటీ, 360 డిగ్రీ పనోరమిక్‌ విజన్‌తో రియల్‌మీ స్మార్ట్‌ కామ్ 360ని తీసుకొచ్చారు. 128జీబీ మెమరీ కార్డ్‌ను సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాల కదలికలను ఇది గుర్తిస్తుంది. 1080పీ క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేస్తుంది. ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్‌, వాయిస్‌ టాక్‌ బ్యాక్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. వైట్ కలర్‌లో లభిస్తుంది. ధర రూ. 2,599. స్మార్ట్ ప్లగ్ ధర రూ. 799. వైఫై కనెక్టివిటీతో గూగుల్‌ అసిస్టెంట్, అలెక్సాలకు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ ఎన్‌1 సోనిక్‌ ఎలక్ట్రానిక్‌ టూత్‌బ్రష్‌ ధర రూ. 799. 120 రోజుల బ్యాటరీ లైఫ్‌తో 20,000 బ్రష్‌ సైకిల్స్‌ను ఇస్తుంది. 20,000 ఎంఏహెచ్‌ రియల్‌మీ పవర్‌ బ్యాంక్‌ 2 ధర రూ. 1,599. 18 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 14 లేయర్‌ సర్క్యూట్ ప్రొటెక్షన్‌ ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న