రెడ్‌మీ 9: ఎక్కువ ఫీచర్స్‌..తక్కువ ధర
close

Updated : 27/08/2020 18:18 IST
రెడ్‌మీ 9: ఎక్కువ ఫీచర్స్‌..తక్కువ ధర

ఇంటర్నెట్‌డెస్క్: భారత మార్కెట్లో రెడ్‌మీ ఫోన్లకు ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్స్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునే వారికి ముందుగా ఉండే ఛాయిస్‌ రెడ్‌మీ ఫోన్లు. అందుకు తగ్గట్టుగానే, రెడ్‌మీ కూడా వరుస లాంఛ్‌లతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా రెడ్‌మీ 9 పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డాట్‌వ్యూ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్ హీలియో జీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. వెనక రెండు, ముందు ఒకటి అమర్చారు. వెనకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డెప్త్‌ సెన్సార్‌తో 2 ఎంపీ కెమెరా ఉంటాయి. ముందు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

మొత్తం రెండు వేరింయంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 4జీబీ/64జీబీ అంతర్గత మొమరీ వేరియంట్ ధర రూ. 8,999గా, 4జీబీ/128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 9,999గాను సంస్థ నిర్ణయించింది. ఆగస్టు 31 నుంచి ఎంఐ.కామ్‌, అమెజాన్‌లలో రెడ్‌మీ 9 అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. కార్బన్‌ బ్లాక్‌, స్కై బ్లూ, స్పోర్టీ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న