రెడ్‌మీ 9 పవర్‌ వచ్చేసింది...!
close

Published : 17/12/2020 20:18 IST
రెడ్‌మీ 9 పవర్‌ వచ్చేసింది...!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం టెక్‌యుగం నడుస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతులోనూ స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు ఫోన్‌ ఎంత చిన్నగా ఉంటే అంత గొప్పగా ఫీల్‌ అయ్యేవాళ్లం. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగణంగా వినియోగదారుల అభిరుచులూ మారుతున్నాయి. ప్రస్తుతం ఫోన్‌ స్క్రీన్‌సైజు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్పగా ఫీల్‌ అవుతున్నారు. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు సైతం కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా షియామీ సరికొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మీ9 పవర్‌ మొబైల్‌ను భారత్‌లో విడుదల చేసింది. 
ఇందులో.. కొత్తమోడల్‌ క్వాడ్‌ రేర్‌ కెమెరాలతోపాటు 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డాట్ డ్రాప్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అలాగే స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌,2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ల‌ను అమ‌ర్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెన్సార్‌తో పాటు ఆండ్రాయిడ్ వర్షన్‌ ఎంఐయూఐ -12తో కూడిన డ్యూయల్ సిమ్ (నానో) ఫీచర్‌ కూడా ఉంది. 

అయితే.. గతనెల చైనాలో విడుదల చేసిన రెడ్‌మీ 9పవర్‌ 4జీ ఫోన్‌తో పోలిస్తే ఇందులో కెమెరా, ర్యామ్‌, స్టోరేజీలలో స్వల్ప తేడాలున్నాయి. ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపు ఉంటుంది. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో ఏర్పాటు చేశారు. 18 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ను సైతం అందించింది. దీంతోపాటు 22.5 వాట్ల ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తున్నారు. శామ్‌సంగ్‌ గెలాక్సీఎం 11, వివో వై20, ఒప్పో ఏ53 ఫోన్లకు దీటుగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా సెల్ఫీలు, వీడియో చాట్‌ కోసం ముందుభాగంలో ఏర్పాటు చేసిన సెన్సార్‌ ఉపయోపడుతుంది. ఫేస్‌ అన్‌లాక్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ఈ మొబైల్‌ 198 గ్రాముల బరువుతో ఉండి ఈజీగా క్యారీ చేయడానికి వీలుంటుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్ సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హెచ్‌డీ వెబ్ స్ట్రీమింగ్‌కు సపోర్టు  చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉంది. 

రెడ్‌మీ 9 ప‌వ‌ర్ ఫీచ‌ర్లు..
* 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌,4జీబీ ర్యామ్‌,64/128 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
*  సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
*  యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఛార్జింగ్

రెడ్‌మీ 9 పవర్‌ ధర ఎంతంటే..
రెడ్‌మీ 9 ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్ మైటీ బ్లాక్‌, ఫియ‌రీ రెడ్‌, ఎల‌క్ట్రిక్ గ్రీన్, బ్లేజింగ్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ కు చెందిన 4జీబి ర్యామ్‌+64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999 ఉండ‌గా,  4జీబీ ర్యామ్‌+128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.11,999గా ఉంది. కాగా.. డిసెంబ‌ర్ 22 నుంచి ఆన్‌లైన్లో ఈ మొబైల్‌ను విక్ర‌యిస్తారు. త్వరలో ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న