రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్: మీ ఫిట్‌నెస్‌ మానిటర్‌
close

Published : 08/09/2020 19:47 IST
రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్: మీ ఫిట్‌నెస్‌ మానిటర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్ ఫోన్లతో వినియోగదారులకు చేరువైన రెడ్‌మీ తాజాగా  తొలి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ స్మార్ట్‌ బ్యాండ్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లో టచ్‌ స్క్రీన్‌, నోటిఫికేషన్‌ అలర్ట్ట్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. తక్కువ బరువతో ఆకర్షణీయమైన డిజైన్‌, వెరైటీ కలర్స్‌, యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో ఈ ఫిట్‌నెట్ బ్యాండ్‌ ఎలా పనిచేస్తుంది, ఇంకా ఏమేం ఫీచర్స్‌ ఉన్నాయో తెలుసుకుందామా మరి...

రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్ ఫీచర్స్‌

1.08 అంగుళాల కలర్‌ ఎల్‌సీడీ ప్యానల్, 0.95 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 24/7 హార్ట్‌బీట్ మానిటర్‌ చేసేందుకు ఆప్టికల్ సెన్సార్‌ను అమర్చారు. ఐదు ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉన్నాయి. మన యాక్టివిటీ ఆధారంగా వీటిలో ఒక దాన్ని ఎంచుకునే సదుపాయం ఉంది. ఇది యూజర్‌ నిద్ర సమయాన్ని మానిటర్‌ చేస్తూ తగిన సూచనలు చేస్తుంది. ఎక్కువ సేపు కదలకుండా ఉంటే కొద్ది సేపు అడుగులు వేయమని వైబ్రేషన్ అలర్ట్ ఇస్తుంది. క్యాలరీ, స్టెప్‌ ట్రాకర్ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. 5ఏటీయం వాటర్‌ ప్రూఫ్ డిజైన్‌తో తయారైంది. మన మూడ్‌కి అనుగుణంగా నచ్చిన మ్యూజిక్‌ను ఎంచుకోవచ్చు. స్మార్ట్‌బ్యాండ్ బ్యాటరి ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల పాటు పనిచేస్తుంది. సౌకర్యవంతమైన ఛార్జింగ్ కోసం యుఎస్‌బీ పోర్ట్‌ ఇస్తున్నారు. దీని ధర రూ. 1,599గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 9 నుంచి అమెజాన్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోం స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. గ్రీన్‌, బ్లాక్‌, బ్లూ, ఆరెంజ్‌ రంగుల్లో లభించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న