108ఎంపీ కెమెరాతో రెడ్‌మీ కొత్త ఫోన్‌
close

Published : 20/09/2020 20:14 IST
108ఎంపీ కెమెరాతో రెడ్‌మీ కొత్త ఫోన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రెడ్‌మీ. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తుంది ఈ కంపెనీ. అయితే త్వరలో రెడ్‌మీ పెద్ద కెమెరాలతో బడ్జెట్‌ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. 64, 108 మెగాపిక్సెల్‌ కెమెరాలతో ఈ ఫోన్లు వస్తున్నాయని విబో అనే టెక్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ఈ మేరకు గౌగ్విన్‌, గౌగ్విన్‌ ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌ మోడల్స్‌ను షావోమి రిజిష్టర్‌ చేసిందట. గౌగ్విన్‌లో 64ఎంపీ కెమెరా, గౌగ్విన్‌ ప్రోలో 108ఎంపీ కెమెరా ఇస్తారని తెలుస్తోంది.

రెడ్‌మీ బ్రాండ్ ద్వారా వీటిని మార్కెట్లోకి తీసుకొస్తారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫోన్ల సంబంధించిన ఇతర వివరాల గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కొద్ది నెలల క్రితం షావోమి 108 కెమెరాతో ఎంఐ 10 పేరుతో భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ విడుదల చేసింది. అయితే ధర రూ. 50 వేలు కావడంతో ఈ ఫోన్‌ కొనుగోలు ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు. తాజాగా మధ్యశ్రేణి ఫోన్‌ మార్కెట్‌ లక్ష్యంగా ఈ కొత్త ఫోన్లు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న