పెద్ద కెమెరా.. బడ్జెట్ ధర.. రెడ్‌మీ కొత్త ఫోన్లు
close

Updated : 11/10/2020 18:19 IST
పెద్ద కెమెరా.. బడ్జెట్ ధర.. రెడ్‌మీ కొత్త ఫోన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస లాంఛ్‌లతో జోరుమీదున్న షావోమి..త్వరలో రెడ్‌మీ సిరీస్‌లో కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. అక్టోబరు 15 తేదీన విడుదల చేయనున్న ఎంఐ 10టీ సిరీస్‌ తర్వాత రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకురానుంది. ఈ సిరీస్‌లో మొత్తం రెండు మోడల్స్‌ ఉంటాయట. రెడ్‌మీ నోట్‌ 10, నోట్ 10 ప్రో. రెడ్‌మీ నోట్10లో మీడియాటెక్‌  డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌, నోట్‌ 10 ప్రోలో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారట. రెడ్‌మీ మిడ్‌ రేంజ్‌ ఫోన్లలో 108 ఎంపీ కెమెరా ఇవ్వడం ఇదే తొలిసారి. అలానే వీటిలో 4,820 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారని తెలుస్తోంది.

ధర విషయానికొస్తే రెడ్‌మీ నోట్‌ 10 ధర 149 డాలర్లు, నోట్‌ 10 ప్రో ధర 224 డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది. మన కరెన్సీలో సుమారు రూ. 11 వేలు, రూ.17 వేలు. భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు.. ఎన్ని కెమెరాలుంటాయి వంటి వాటితో పాటు ఇతర ఫీచర్స్‌ గురించి తెలియాల్సి ఉంది. అయితే రెడ్‌మీ నోట్‌7 సిరీస్ తరహాలోనే నోట్ 10 సిరీస్‌ ఫోన్లు కూడా అమ్మకాల్లో దూసుకుపోతాయని మార్కెట్‌ వర్గాల అంచనా. వీటిని నవంబరు చివరి వారంలో విడుదల చేస్తారని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న