యాపిల్‌ బాటలోనే శాంసంగ్‌..?
close

Published : 30/10/2020 21:10 IST
యాపిల్‌ బాటలోనే శాంసంగ్‌..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా కొత్త ఐఫోన్‌ రిలీజ్‌ అయితే దాని ఫీచర్లు, ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడం సాధారణం. కానీ, ఈ సారి ఐఫోన్‌12 విడుదల సందర్భంగా బాక్స్‌లో ఛార్జర్‌, ఇయర్‌ఫోన్స్‌ తొలగించడం చర్చనీయాంశమైంది. దీనిపై యాపిల్‌పై దుమ్మెత్తి పోయనివారు లేరు. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ సైతం తన సోషల్‌ మీడియా ఖాతాలో యాపిల్‌ను ట్రోల్‌ చేస్తూ పోస్టులు పెట్టింది. ఇప్పుడు శాంసంగ్‌ సైతం అదే పనిచేయబోతోందని వార్తలు వస్తున్నాయి.

శాంసంగ్‌ తీసుకురాబోయే ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌21ను ఛార్జర్‌, ఇయర్‌ ఫోన్స్‌ లేకుండానే తీసుకురావాలని యోచిస్తోందట. కొన్ని దక్షిణ కొరియా మీడియా సంస్థలు ఇప్పటికే ఈ విషయమై వార్తలు రాశాయి. గతంలోనూ యాపిల్‌ను పలు సందర్భాల్లో శాంసంగ్‌ విమర్శించింది. నాచ్‌ డిస్‌ప్లేను తీసుకొచ్చినప్పుడు.. 3.5ఎంఎం ఆడియో జాక్‌ను తొలగించినప్పుడు ట్రోల్‌ చేసింది. కొద్దిరోజులకు తాను కూడా అదే బాటలో పయనించింది. పర్యావరణ హితం కోసమే ఛార్జర్‌, ఇయర్‌ఫోన్స్‌ను తాము తొలగించామని ఐఫోన్‌ 12 విషయంలో యాపిల్‌ చెప్పుకొచ్చింది. మరి శాంసంగ్‌ ఏ సాకు చెబుతుందో చూడాలి మరి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న